కార్యాలయంలో వణుకు
అక్రమ గ్రానైట్‌పై విచారణ సాగడంతో మైనింగ్ శాఖ కార్యాలయంలో వణుకు పట్టుకుంది. ఈ విచారణతో అక్రమాలకు సహకరిస్తున్న అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విచారణ అనంతరం త్వరలో కార్యాలయంలో మార్పులు చేర్పులు జరగనున్నట్టు సమాచారం. అక్రమాలను కప్పి పుచ్చేందుకు కొందరు అధికారులు కుయుక్తులు పన్నుతున్నట్టు సమాచారం. ఇక్కడే పాతుకుపోవాలని ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దీనికి పచ్చ నేతల సహకారం కూడా తీసుకుంటున్నట్టు చర్చించుకుంటున్నారు. అయితే అక్రమ గ్రానైట్ వ్యాపారంపై కూటమిలోని బలమైన వర్గం ఫిర్యాదు చేయడంతో మార్పు లు..చేర్పులు కచ్చితంగా ఉంటాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.


