మామిడి ధరపై పంచాయితీ
గంటల కొద్దీ సాగిన చర్చలు పాల్గొన్న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ఎంపీ
చిత్తూరు కలెక్టరేట్: మామిడి ధరపై కలెక్టరేట్‌లో ఫ్యాక్టరీ నిర్వాహకులు, రైతులతో గంటల కొద్దీ చర్చ లు నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు చర్చలు సాగాయి. మామిడికి గిట్టుబాటు ధర ఇవ్వలేదని గతంలో రైతులు ఆందో ళనలు చేపట్టారు. అదేవిధంగా మామిడికి గిట్టుబాటు ధర ప్రకటించాలనే డిమాండ్‌తో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రభుత్వం తరఫున ఇచ్చే గిట్టుబాటు ధరను జిల్లాలోని 31,929 మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. ఇంకా చాలామందికి టెక్నికల్ సమస్య వల్ల రూ.4 గిట్టుబాటు ధర అందలేదు. ఈ పరిస్థితుల్లో పరి శ్రమల నిర్వాహకులు రూ.8 చొప్పున నగదు అందించాల్సి ఉండగా, కొన్ని ఫ్యాక్టరీలు అతితక్కువగా నగ దు ఇచ్చాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
చర్చోప చర్చలు
మామిడి ధర వ్యవహారంపై సోమవారం గంటల కొద్దీ చర్చలు నిర్వహించారు. రైతులను బయట ఉండమని చెప్పి మొదటగా జిల్లాలోని మామిడి పరిశ్రమ ల నిర్వాహకులతో చర్చలు జరిపారు. అనంతరం రైతులతో చర్చించారు. అనంతరం బయటకొచ్చిన కొంత మంది రైతులు అసహనం వ్యక్తం చేశారు. మామిడి రైతుల సమస్యను మీడియాకు వెల్లడించేందుకు కొంత మంది రైతులు ఆసక్తి చూపగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆనందనాయుడు వారిని బెదిరించి బయటకు వెళ్లకూడదని చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
ఆలస్యం చేయొద్దు
చర్చల అనంతరం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్సార్‌కడప, అన్నమయ్య జిల్లాల్లో మామిడి దిగుబడి ఎక్కువగా వచ్చిందన్నారు. కేజీకి రూ.4 గిట్టుబాటు ధర అందజేశామని, సుమారు లక్ష మంది రైతులకు పరిశ్రమల నిర్వాహకులు డబ్బులు ఇచ్చారన్నారు. మరో నాలుగు నెలల్లో బకాయిలన్నీ చెల్లించాలని పరిశ్రమల నిర్వాహకులను ఆదేశించారు.
ఫ్యాక్టరీ నిర్వాహకులు రూ.8 ఇవ్వాలని రైతుల పట్టు


