వివిధ సమస్యలపై నమోదైన 274 అర్జీలు
వినతులు స్వీకరించిన
కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా.. మేమంటే ఎందుకింత కక్ష’ అంటూ అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వారం అర్జీలు ఇస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు సమస్యల పరిష్కారానికి క్యూ కట్టి అర్జీలు అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్ ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 274 అర్జీలు నమోదయ్యాయని కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు.
కలెక్టరేట్‌కు పోటెత్తిన
అర్జీదారులు


