జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

Nov 6 2025 8:14 AM | Updated on Nov 6 2025 8:14 AM

జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

సదుం: స్థానిక పోలీస్‌ గ్రౌండ్స్‌లో చిత్తూరు జిల్లా 35వ సబ్‌ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక బుధవారం జరిగినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షురాలు మమతా రెడ్డి తెలిపారు. ఈ పోటీలను సీనియర్‌ కబడ్డీ జాతీయ క్రీడాకారులు ఆంజనేయులు, శ్రీనివాసులు, గుల్జార్‌ పవిత్ర, రుక్సానా, నౌషాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో బాలికలు 60 మంది, బాలురు 86 మంది పాల్గొన్నట్లు చెప్పారు. ఎంపికై న వారు ఈనెల 7 నుంచి 9 వరకు బద్వేల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రవీంద్రరెడ్డి తెలిపారు.

ఎంపికై న బాలుర జట్టు

ధరణీధర, బాలాజీ, భరత్‌కుమార్‌, మహేంద్ర, సుధీర్‌(సదుం), వెంకటేశ్‌, ప్రసన్నకుమార్‌, ప్రిన్స్‌ (నిండ్ర), సతీష్‌(పలమనేరు), హర్షవర్ధన్‌(ఏఎన్‌కుంట), నిఖిల్‌(దిగువమాఘం), ప్రవీణ్‌కుమార్‌ (చిత్తూరు), సుశీల్‌ (సిద్ధంపల్లె), గోకుల్‌(అరగొండ), ప్రవీణ్‌కుమార్‌ నాయక్‌(పీలేరు)

బాలికల జట్టు:

సోఫియా, జాహ్నవి, పల్లవి, లిఖిత, గీతిక (సదుం), అశ్విని, కుమారి, యామిని, వర్షిత(పీలేరు), చందు(దామలచెరువు), వైష్ణవి (పులిచర్ల), డీసీ, మౌనిక(చిత్తూరు), మిస్బా (కల్లూరు), పునీత (రొంపిచర్ల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement