రైలు కిందపడి వ్యక్తి మృతి
వడమాలపేట (పుత్తూరు) : వడమాలపేట మండలం పూడి రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే కానిస్టేబుల్ శివకుమార్ కథనం మేరకు పూడి రైలు మార్గంలోని 124బి/31 వద్ద సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు ఒంటిపై బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వనదుర్గాపురంలో వైద్య పరీక్షలు
పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం గ్రామంలో కొంతమంది ఆదివారం విరేచనాలు, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పీహెచ్‌సీ వైద్యాధికారులు మోహన్‌క్రిష్ణ, జయకుమార్ వనదుర్గాపురం గ్రామానికి వెళ్లి విరేచనాలు, వాంతులు అయిన వారికి వెద్య పరీక్షలు చేశారు. డాక్టర్లు మాట్లాడుతూ.. వారు తీసుకున్న ఆహారం సరికాదని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ మార్పు వల్ల మనం తినే ఆహారం అప్పటి కప్పుడు చేసింది తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్ కుమార్. మండల విస్తరణాధికారి సత్యనారాయణ, సీహెచ్‌ఓ సుబ్రమణ్యం, ఆరోగ్య సిబ్బందులు పాల్గొన్నారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి


