భక్తులతో బోయకొండ కిటకిట
ప్రత్యేక అలంకరణలోఅమ్మవారు
చౌడేపల్లె బోయకొండ ఆలయంలో భక్తుల రద్దీ
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆదివారం సెలవు దినం కావడంతో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనె దీపాలు పెట్టి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈవో ఏకాంబరం ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
భక్తులతో బోయకొండ కిటకిట


