టమాటకు రెక్కలు
పలమనేరు హార్టికల్చర్ డివిజన్‌లో సాగు వివరాలు
పలమనేరు : జిల్లాలో టమోట ధరలకు రెక్కలొచ్చాయి. పలమనేరు మార్కెట్‌లో ఆదివారం 14 కిలోల బాక్సు ధర రూ.500 దాటింది. గత నెలగా బాక్సు రూ.200 కూడా దాటలేదు. అయితే కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా టమాట తోటలు దెబ్బతిన్నాయి. తోటల్లోనే మొక్కలు కుళ్లిపోవడం, కాయలు దెబ్బతినడంతో భారీగా సరుకు తగ్గింది. దీంతో డిమాండ్‌కు సరిపడా సప్లయ్ లేక ధర అమాంతం పెరిగేందుకు కారణమైందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కాగా ఈనెలాఖరు దాకా టమోటా ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి అంచనా వేస్తున్నారు.
భారీగా తగ్గిన సరుకు
గత కొన్నాళ్లుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమాట తోటలు దెబ్బతిన్నాయి. నీటినిల్వ ఎక్కువగా ఉన్న తోటలు కుళ్లిపోయాయి. కాయలు సైతం కుళ్లి రాలిపోయాయి. దీంతోపాటు తెగుళ్ల కారణంగా కాయలపై మచ్చలు పడి నాణ్యత తగ్గింది. డివిజన్ పరిధిలో తోటలు సగానికిపైగా దెబ్బతినడంతో మార్కెట్‌కు సరుకు భారీగా తగ్గింది.
టమాట ఈ సీజన్‌లో సాధారణ సాగు 5 వేల హెక్టార్లు
ప్రస్తుతం సాగైన పంట 1500 హెక్టార్లు
కోతదశలో ఉన్న తోటలు 600 హెక్టార్లు
ఈ సీజన్‌లో మండీలకు రావాల్సిన సరుకు 100 లారీ లోడ్లు
ప్రస్తుతం మార్కెట్లకు చేరుతున్న సరుకు (పొరుగు జిల్లాల నుంచి కలిపి) 60 లోడ్లు


