ముగిసిన ఎస్‌జీఎఫ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
గోపాలపట్నం: స్థానిక ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికల జట్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
విభాగాల వారీగా విజేతలు వీరే..
అండర్–14 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో అనంతపురం జిల్లా ప్రథమ స్థానాన్ని, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి.
అండర్–17 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానాన్ని, అనంతపురం, కృష్ణా జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి.
అండర్–19 విభాగం: బాలుర విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానాన్ని, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు అధికారులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు అభినందించారు. వారికి జ్ఞాపికలు, శాలువాలు అందజేశారు.


