జాతీయ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉర్దూ టీచర్లు ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ టీచర్ అవార్డులను ఈ నెల 26న డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథుల నుంచి స్వీకరించారు. వారు ఉర్దూ పాఠశాలల్లో ఉత్తమ విద్యాబోధన అందించినందుకు గాను జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. జిల్లాలోని పుంగనూరులోని ఉర్దూ జెడ్పీ హైస్కూల్‌లో గణిత టీచర్‌గా పనిచేస్తున్న రబ్బాని, పలమనేరు న్యూపేట్ హైస్కూల్‌లో జీవశాస్త్రం టీచర్‌గా పనిచేస్తున్న సుస్రత్ అలియా బేగమ్, చిత్తూరు నగరంలోని జైహింద్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ముక్తార్ అహ్మద్, చిత్తూరు నగరంలోని ఉర్దూ ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న మహబూబ్‌బాషా జాతీయ అవార్డులు స్వీకరించారు.


