బైరెడ్డిపల్లె : పాత భవనం కూల్చడానికి వెళ్లిన కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని ధర్మపురిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన భాస్కర్ పాత భవనం కూల్చడానికి ఐదుగురు కూలీలకు ఒప్పందం చేశాడు. అదే గ్రామానికి చెందిన ఐదుగురు కూలీలు భవనం కూల్చుతుండగా గంగాధర్ (29) అనే వ్యక్తిపై ప్రమాదవశాత్తు గోడ కుప్పకూలింది. దీంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన గంగాధర్‌ను స్థానికులు బైరెడ్డిపల్లె పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు గంగాధర్ మృతి చెందినట్లు నిర్ధారించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
బంగారుపాళెం: స్థానిక సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. అతనికి సుమారు 50 ఏళ్లు ఉంటాయని, అనారోగ్యంతో బంగారుపా ళెం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి మృతి చెందాడని తెలిపారు. మృత దేహాన్ని మార్చురీలో ఉంచామని, ఆచూకీ తెలిసిన వారు 9440796736 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
భవనం కూల్చుతుండగా కూలీ మృతి


