చిరుత సంచారం పుకార్లు
తవణంపల్లె: మండలంలోని అరగొండ– కామాలూరు రోడ్డులో చిరుత సంచారం చేసినట్టు వచ్చిన పుకార్లలో వాస్తవం లేదని ఫారెస్టు బీట్ ఆఫీసర్ రెడ్డెప్ప తెలిపారు. అరగొండ– కామాలూరు రోడ్డులో నాలుగు రోజుల క్రితం ఓ ప్రయివేటు జ్యూస్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న గుట్టలో మేకలు మేపుతున్న కాపరి చిరుత పులి వచ్చి ఒక మేక పిల్లను పట్టుకొని వెళ్లిందని పుకార్లు చేశారని పేర్కొన్నారు. దీనిపై ఫారెస్టు సిబ్బంది గుట్టలో చిరుత జాడ గురించి గాలిస్తే ఎలాంటి ఆనవాళ్లు కనపడలేదని వివరించారు. అరగొండ, చారాల, పైమాఘం పరిసరా గ్రామాల్లో చిరుత సంచారంపై అవగాహన కల్పించి అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.


