తుపానుపై అప్రమత్తం
చిత్తూరు అర్బన్: అల్పపీడనం కారణంగా మరో మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే సమాచారంతో చిత్తూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని నీవానది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శనివారం రాత్రి నీవానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, టూటౌన్ సీఐ నెట్టికంటయ్య తమ సిబ్బందితో వెళ్లి.. స్థానికులతో మాట్లాడారు. రాత్రి వర్షం ఎక్కువైతే నీళ్లు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అనంతరం పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఫోన్– 112, 9491074517, 9440796706 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు.
తుపానుపై అప్రమత్తం


