ప్రైవేటుపై మోజు.. | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుపై మోజు..

Oct 24 2025 7:36 AM | Updated on Oct 24 2025 7:36 AM

ప్రైవ

ప్రైవేటుపై మోజు..

● ప్రైవేటు క్యాన్సర్‌ ఆస్పత్రి తీసుకొచ్చే ప్రయత్నాలు ● దుబాయ్‌ కంపెనీతో ఒప్పందం ● అందుకే ఏడాదిగా నిధులు విడుదల చేయని టీటీడీ ● 400 పడకల ఆస్పత్రిని 100కే పరిమితం ● అరిగిపోయిన, పనిచేయని పరికరాలతో వైద్యుల అవస్థలు

న్యూస్‌రీల్‌

కూటమి ప్రభుత్వం.. కార్పొరేట్‌కు సలాం.. బడా కంపెనీల అడుగులకు మడుగులు.. ప్రైవేట్‌తో ఒప్పందం..సర్కారు వైద్యానికి మంగళం.. ఫలితం పేద రోగుల ప్రాణాలు అర్పణం. ఇదీ నేటి సర్కారు స్థితి. తిరుపతిలోని ఉచిత క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్వీర్యమే ఇందుకు నిదర్శనం. ‘క్యాన్సర్‌ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతానికి వెళ్లకూడదు. పేద లు, అట్టడుగు వర్గాల వారి కోసం ప్రపంచస్థాయి వైద్య సౌకర్యాలతో ఆస్పత్రి కా వాన్న ఆశయంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన హాయాంలో నిర్మా ణం చేపట్టిన క్యాన్సర్‌ ఆస్పత్రి స్థాయి తగ్గించడంతోపాటు నిధులు విడుదల చే యకుండా దుబాయ్‌ కంపెనీతో టీటీపీ ప్ర భుత్వం ఒప్పందం చేసుకోవడంతో క్యాన్స ర్‌ రోగులు ఆందోళన చెందుతున్నారు.
చెట్ల కింద.. పుట్ల చాటున క్యాన్సర్‌ రోగులు

ఇక ఉచితానికి మంగళమే!

శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రైవేటు మోజులో కూటమి సర్కారు.. ఉచిత క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్యీర్యం చేస్తోంది. ఉచితంగా క్యాన్సర్‌ వైద్యసేవలు అందించే తిరుపతి శ్రీబాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీని ప్రాణం తీసి.. దుబాయ్‌ కంపెనీ ఆధ్వర్యంలో ప్రైవేటు క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్మించేందుకు కూటమి కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు దుబాయ్‌లో బుర్జిల్‌ హెల్త్‌కేర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఆ విషయం కూటమి గెజిట్‌ పత్రిక ద్వారా వెళ్లడించింది. వివరాల్లో కెళితే.. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుపతి శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ ఆస్పత్రి క్యాన్సర్‌ రోగుల పాలిట వరంలా మారింది. ‘క్యాన్సర్‌ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతానికి వెళ్లకూడదు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం ప్రపంచస్థాయి వైద్య సౌకర్యాలతో ఆస్పత్రి కావాలి’’.. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రస్థాయి అధికారుల సమావేశంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్న మాటలు ఇవి. ఆయన ఆదేశాల మేరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదాల చెంత తిరుపతిలో స్విమ్స్‌ యూనివర్సిటీకి అనుబంధంగా 400 పడకలతో శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. నాటి సీఎం ఆదేశాల మేరకు 2022లో స్విమ్స్‌ గవర్నింగ్‌ బాడీ తీర్మానం చేసి టీటీడీకి పంపింది. 2023 ఫిబ్రవరిలో టీటీడీ అంగీకారం తెలిపింది. అదే ఏడాది ఏప్రిల్‌లో టీటీడీ సుమారు రూ.130 కోట్లు బడ్జెట్‌ కేటాయించింది. మరో రూ.100 కోట్ల స్విమ్స్‌ నిధులతో కలిపి అదే ఏడాది సెప్టెంబర్‌ 20న పనులు ప్రారంభించింది. 2024 అక్టోబర్‌లో క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించేందుకు నిర్మాణ పనులు వేగంగా చేపట్టారు. కొన్ని అనివార్య కారణాలతో నిర్మాణం పూర్తి కాలేదు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 21 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 73,853 మంది స్వామివారిని దర్శించుకోగా 22,551 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది.

ఐరాస సమావేశాలకు మిథున్‌రెడ్డి

నిరుపేదలకు సైతం కార్పొరేట్‌ స్థాయిలో ఉచితంగా వైద్యసేవలందించాలనే లక్ష్యంతో నాడు వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన క్యాన్సర్‌ ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రికి వచ్చే క్యా న్సర్‌ రోగులకు బెడ్లు దొరక్కపోవడంతో చెట్ల కింద ప్రాణాలు అరచేతిలో పెట్టు కుని బిక్కు బిక్కుమంటున్నారు. తిరుపతిలోని క్యాన్సర్‌ ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితులను చూసిన రోగులు కొందరు ఇంటి వద్ద బాధపడుతుండగా, మరి కొంద రు ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రుల బాటపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్వహణపై వైద్యులు కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. క్యాన్సర్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఏడాదికి 70 వేల నుంచి 80 వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని ప్రాధేయపడినట్లు తెలిసింది. ఆస్పత్రి అభివృద్ధి చెందితే మరో 200 మందికిపైగా వైద్యులుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కోరినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో దుబాయ్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో ద్వారా తెలుసుకున్న క్యాన్సర్‌ రోగులు షాక్‌ గురయ్యారు. ఉచితంగా వైద్య సేవలు అందించే ఆస్పత్రిని నిర్యీర్యం చేసి, ప్రైవేటు ఆస్పత్రిని తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడంపై రోగులు, బంధువులు మండిపడుతున్నారు.

ప్రైవేటుపై మోజు.. 1
1/2

ప్రైవేటుపై మోజు..

ప్రైవేటుపై మోజు.. 2
2/2

ప్రైవేటుపై మోజు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement