‘అయ్యో’ర్లకు టెట్‌ గండం! | - | Sakshi
Sakshi News home page

‘అయ్యో’ర్లకు టెట్‌ గండం!

Oct 24 2025 7:36 AM | Updated on Oct 24 2025 7:36 AM

‘అయ్యో’ర్లకు టెట్‌ గండం!

‘అయ్యో’ర్లకు టెట్‌ గండం!

ఆందోళనలో ప్రభుత్వ

పాఠశాలల టీచర్లు

సర్వీస్‌లో ఉన్న టీచర్లు టెట్‌

రాయాల్సిందేనంటూ సుప్రీం తీర్పు

టెన్షన్‌ టెన్షన్‌గా సర్కారు

ఉపాధ్యాయులు

సర్వీస్‌ పూర్తయ్యాక టెట్‌ నిబంధన న్యాయమేనా?

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

చిత్తూరు జిల్లా వివరాలు

ఎంకి పెళ్లి సుబ్బి.. చందంగా ఉంది ప్రభుత్వ టీచర్ల పరిస్థితి. టెట్‌ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లు ప్రస్తుతం సర్వీస్‌ కొనసాగించాలన్నా, ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్‌ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని టీచర్లలో ఆందోళన నెలకొంది. ఎప్పుడో 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై ఈ వయస్సులో టెట్‌ రాసి ఉత్తీర్ణత సాధించడం సాధ్యమవుతుందా ? అని ప్రశ్నిస్తున్నారు? టెట్‌ నిర్వహణపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ఉపాధ్యాయులు టెన్షన్‌కు లోనవుతున్నారు. టెట్‌ పై టీచర్లలో నెలకొన్న ఆందోళనపై కథనం.

చిత్తూరు కలెక్టరేట్‌ : విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కొన్ని మార్పులు చేపట్టారు. విద్యార్హతలతో పాటు వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ప్రవేశ పెట్టారు. సర్కారు బడుల్లో బోధించే టీచర్లకు టెట్‌ తప్పనిసరిగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు జిల్లా లో పనిచేస్తున్న టీచర్లలో కలవర పరుస్తోంది. పిల్ల లకు పాఠాలు బోధించి పరీక్షలు నిర్వహించే గురువులకే ఇప్పుడు పరీక్ష పాస్‌ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెట్‌ తప్పనిసరి చేయడంతో పాటు పైగా రెండేళ్లలోపు పాస్‌ కావాల్సిందేనంటూ నిబంధన విధించడం సీనియర్‌ టీచర్లలో ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం టెట్‌ పరీక్ష నోటిఫికేషన్‌ తెర పైకి తీసుకురావడంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో ని 19,320 మంది టీచర్లు పెదవి విరుస్తున్నారు.

2010కి ముందు టీచర్లు టెట్‌ రాయాల్సిందే..

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2010 వ సంవత్సరం నుంచి ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారంతా టెట్‌ ఉత్తీర్ణత పొందినవారే. అయితే 2010 వ సంవత్సరం కంటే ముందు కేవలం డీఎస్సీలో మాత్రమే ప్రతిభ చూపి ఉపాధ్యాయ పోస్టులు పొందారు. 2010 కంటే ముందు టీచర్‌ పోస్టులు సాధించిన వారు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేల సంఖ్యలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఐదు సంవత్సరాల లోపు ఉద్యోగ విరమణ పొందే వారు మినహా మిగతా వారు 2027 ఆగస్టు 31 వ తేదీలోపు టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. ఒక వేళ ఆలోగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగం వదులుకోవాలని తీర్పులో వెల్లడించింది. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని వేల మంది టీచర్లు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.

సర్వీసు నిబంధనలు లేకున్నా..

టెట్‌ అర్హత తప్పనిసరి చేయడం సరికాదని సీనియర్‌ టీచర్లు అభిప్రాయపడుతున్నారు. టెట్‌ నిబంధనపై టీచర్లు గుర్రుమంటున్నారు. ఆగస్టు 2010 తర్వాత జరిగిన నియామకాలు నిబంధదనలకు లోబడి జరుగుతున్నాయి. కానీ అప్పటికే సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్‌ తప్పనిసరి అని ఎన్‌సీటీఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) నిబంధనల్లో లేదని టీచర్లు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల విద్యాశాఖ ఎక్కడా వృత్తిలో ఉన్న టీచర్లు టెట్‌ కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఇవ్వలేదని, కేవలం వృత్తిలోకి రావాలనుకునే అభ్యర్థులకు అంశంగా పరిగణించాలని చెబుతున్నారు.

రివ్యూ పిటీషన్‌ దాఖలు చేయాలి

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తీర్పును పున:సమీక్షించమని రివ్యూ పిటీషన్‌ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. టెట్‌ పరీక్షపై వేల మంది టీచర్లు టెన్షన్‌ ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పలు సంఘాల నాయకులు టెట్‌ పరీక్ష కు సంబంధించి కూటమి ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా ఏ మాత్రం స్పందన లేకుండా పోయింది. ఉద్యోగోన్నతి పొందడానికి టెట్‌ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని కోరుతున్నారు. టీచర్లకు బోధన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని , ఉద్యోగంలో కొనసాగడానికి, 50 సంవత్సరాలు దాటిన వారికి ఉద్యో గోన్నతి పొందేందుకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగోన్నతి తర్వాత టెట్‌ పాస్‌ కావడానికి 4 సంవత్సరాల సమయం ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రాథమిక పాఠశాలలు 1,909

ప్రాథమికోన్నత పాఠశాలలు 205

ఉన్నత పాఠశాలలు 355

మొత్తం పాఠశాలలు 2,469

విధులు నిర్వహిస్తున్న టీచర్లు 9,162

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement