కార్యకర్తలే వైఎస్సార్ సీపీకి బలం
కుప్పంరూరల్ : కార్యకర్తలే వైఎస్సార్ సీపీకి బలమని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. గురువారం రామకుప్పం మండల పరిధిలోని పంద్యాలమడుగు, గొరివిమాకులపల్లి పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించి పంచాయతీ అధ్యక్షులు, సభ్యులను ఎన్నుకున్నారు. పంద్యాలమడుగు అధ్యక్షులు గా వెంకటాచలపతి, గొరివిమాకులపల్లి పంచాయ తీ అధ్యక్షులుగా అశోక్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. 2029లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నితిన్‌రెడ్డి, రామకుప్పం మండల అధ్యక్షుడు బాబురెడ్డి, కో కన్వీనర్ చంద్రారెడ్డి, బాబురెడ్డి, హేమాచలపతి, సైఫుల్లా, సతీష్, వెంకటాచలం, నాయకులు ఉన్నారు.


