నాయకులకే ఉపాధి
సాక్షి టాస్క్‌ఫోర్స్: పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో జాతీయ ఉపాఽధి పథకం పేరుకే జరుగుతోంది. కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఉపాధి సిబ్బంది ఇక్కడ అంతా అధికార పార్టీ నాయకులకు ఉపాధి చూపుతున్నారు. అధికారులు పాత పనులకు బిల్లులు పెడితే 20 శాతం ఇవ్వాల్సిందే. దీంతో రెండు మండలాల్లో ఉపాధి పనులు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నారు. 2024–25 సంవత్సరాల్లో రెండు మండలాల్లో కూలీల కోసం రూ.25 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులు 90 శాతం అధికార పార్టీ నాయకులకు చేరాయి. ఉపాధి పనులు ఎక్కడ జరుగుతున్నాయో కూలీలకు తెలియదు మస్టర్‌లో సంతకాల కోసం కూలీల దగ్గరకు వెళ్లి సంతకాలు చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల బలవంతంగా సంతకాలు చేసుకుంటున్నారు. మరి కొన్ని చోట్ల కూలీలకు వారానికి రూ.200 ఇచ్చి సంతకాలు పెట్టించుకుంటున్నట్లు సమాచారం. గతంలో పని చేసిన ఉపాధి సిబ్బందిని తొలగించి, వారికి అనువుగా ఉన్న వారిని నియమించుకున్నా రు. దీంతో అక్రమాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతున్నాయి. ఉపాధి పథకం ప్రారంభం నుంచి ప్రతి చెరువులో ఎన్ని పనులు చేశారు.. ఇప్పుడు ఎన్ని పనులు చేశారని లోతుగా విచారణ జరిపితే వాస్తవాలు బయట పడాతాయి. ప్రతి సంవత్సరం చేసిన గుంతలను మళ్లీ మెరుగులు తీద్ది బిల్లులు చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కూలీలకు రోజు పని దొరకడం లేదు. యంత్రాలకు మాత్రం రోజు పనులు కల్పిస్తున్నారు. మండల, గ్రామ పంచాయతీ సరిహద్దులో ఒక్కరు చేసిన పనులను మరొకరు చేసుకుంటున్నారు. ఇద్దరు ఒకే పనిని అధికారులకు చూపుతున్నారు. మినీ గోకులాలు పశువులు లేని వారికి అధికారులు మంజూరు చేయించారు. రెండు మండలాల్లో 195 గోకులాలు మంజూరు చేశారు. వాటిలో 70 శాతం పనులు పూర్తి చేశారు. విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తా యని ప్రజలు చెబుతున్నారు.
పుంగనూరు నియోజక వర్గంలోని రొంపిచెర్ల, పులిచెర్ల, సదుం మండలాలకు ఒక మండలానికి నలుగురు విజిలెన్స్ అధికారుల చొప్పున కల్లూరు జెడ్సీ గెస్ట్‌హౌస్‌కు బుధవారం సాయంత్రానికి చేరుకున్నారు. అక్కడ రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్లో జరిగిన ఉపాధి పనులపై రికార్డులను తనిఖీ చేపట్టారు. గురువారం నుంచి క్షేత్రస్థాయిలో విచారణ చేయనున్నారు.
నాయకులకే ఉపాధి


