కుస్తీ చాంపియన్‌ చిత్తూరు | - | Sakshi
Sakshi News home page

కుస్తీ చాంపియన్‌ చిత్తూరు

Oct 23 2025 6:15 AM | Updated on Oct 23 2025 6:15 AM

కుస్తీ చాంపియన్‌ చిత్తూరు

కుస్తీ చాంపియన్‌ చిత్తూరు

విజయవాడ రూరల్‌: నున్న గ్రామంలోని జరుగుతున్న అండర్‌–19 అంతర్‌ జిల్లాల కుస్తీ పోటీల్లో ప్రీస్టైల్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా చిత్తూరు జిల్లా బాలికల జట్టు నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఏపీఎస్‌జీఎఫ్‌), సమగ్ర శిక్ష(ఎస్‌ఎస్‌), ఎన్టీఆర్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అశోక్‌ ఫంక్షన్‌హాలులో 69వ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–19 అంతర్‌ జిల్లాల కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. బాలికల ప్రీస్టైల్‌లో మూడు బంగారు, రెండు రజితం, ఒక కాంస్య పతకం సాధించిన చిత్తూరు జిల్లా జట్టు 22 పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. 17 పాయింట్లతో తూర్పుగోదావరి రెండో స్థానం, పశ్చిమ గోదావరి మూడో స్థానంలో నిలిచాయి. బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఉమ్మడి 13 జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు, కోచ్‌లు మేనేజర్లు హాజరయ్యారు. బుధవారం బాలికల విభాగం పోటీలు ముగిశాయి. విజేతలకు నున్న పీఏసీఎస్‌ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం ఎస్‌.రవిప్రసాద్‌, టోర్నీ పరిశీలకుడు చిటికిన రమేష్‌, ఏపీ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.భూషణం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ టి.శ్రీలత, పి.ఆనంద్‌, సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు టి.విజయవర్మ, ఎస్‌.రమేష్‌, ఎం.వి.సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

26.3 అడుగులు చేరుకున్న అరణియార్‌ నీటి మట్టం

నాగలాపురం: పిచ్చాటూరు మండల పరిదిలోని అరణియార్‌ రిజర్వాయర్‌లో నీట మట్టం 26.3 అడుగులకు చేరుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రభావంతో జలాయంలో నీటి నిల్వ పెరిగింది. క్యాచ్‌మెంట్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్నందున రాబేయే రోజుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అరణియార్‌ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయానికి 301 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. ప్లడ్‌ గేటు మూసి వేసి ఉండటంతో ఔట్‌ఫ్లో లేవని అధికారులు వెల్లడించారు. రేపు భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రాజెక్టు వద్ద గట్టి నిఘా ఉంచామని అన్నారు. ఏఈ స్థాయి అధికారులను 24 గంటల పాటు ప్రాజెక్టూ గేటు వద్ద ఉండి పర్యావేక్షించేలా చర్యలు చేపట్టామని తెలిపారు..గ్రామస్తులు, రైతులు రాబోయే సాగు సీజన్‌కు సరిపడేంత నీరు అరణియార్‌లో నిల ఉండండం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement