సీఎంకు విన్నవించినా పట్టా ఇవ్వలేదు
గుడుపల్లె: సీఎం చంద్రబాబు సార్‌తోపాటు విద్యాశాఖ మంత్రి లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి విన్నవించినా తన అనుభవంలో ఉన్న భూమికి అధికారులు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వలేదని మెహన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. గుడుపల్లె మండల కమ్మగుట్టపల్లె గ్రామానికి చెందిన మెహన్ సర్వే నంబరు 252లో 4 ఎకరాల విస్తీరణంలో పశువుల మేతకు చెందిన భూమిని అనుభవించుకుంటున్నాడు. ఈ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు వినతి పత్రాలు అందించాడు. దీంతో రెవెన్యూ అధికారులు ఉన్నాతాధికారులు ఆదేశానుసారం రెవెన్యూ అధికారులు స్పందించి మెహన్ అనుభవిస్తున్న భూమిని సర్వే చేయగా పశువుల మేత భూమి అని తేలింది. దీంతో అధికారులు పశువుల మేత భూమికి పట్టా పాసుప్తుకాలు ఇవ్వమని తేల్చి చెప్పేశారు. అనంతరం మెహన్ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఆ భూమికి పట్టాలు ఇవ్వమని చెప్పారన్నారు. దీనికి తోడు గ్రామం పక్కన ఉన్న ప్రభుత్వ భూమి ప్రజల అవసరాల నిమిత్తం కావాల్సింటుందని స్థానిక సర్పంచ్ రిజర్వేషన్ కూడా ఇచ్చారని తహసీల్దార్ సీతారాం తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పినా తనకు పట్టా పాసుపుస్తకాలు అధికారులు ఇవ్వలేదని తనకు ఏమైనా ప్రాణహాని జరిగిందంటే తన భార్య బిడ్డలు అనాథలవుతారని, ఇందుకు అధికారులే బాధ్యులని మెహన్ పెట్టిన వీడియెలో వైరల్ అవుతోంది.


