ఆశలు.. అడియాశలై! | - | Sakshi
Sakshi News home page

ఆశలు.. అడియాశలై!

Oct 22 2025 7:04 AM | Updated on Oct 22 2025 7:04 AM

ఆశలు.. అడియాశలై!

ఆశలు.. అడియాశలై!

అసంబద్ద డీఏపై ఉద్యోగుల మండిపాటు ప్రకటనకు విరుద్ధంగా కరువు భత్యం (డీఏ) ప్రకటన మోసం చేసేందుకే విరుద్ధంగా ఉత్తర్వులంటూ ఆవేదన విడ్డూరమైన జీవోలు జారీ చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం చంద్రబాబు సర్కారు పై ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహం

దీపావళి కనుకగా పెండింగ్‌ బకాయిలు

విడుదల చేస్తారని ఉద్యోగులు, టీచర్లు కూటమి ప్రభుత్వంపై గంపెడాశలు

పెట్టుకున్నారు. తీరా వారి ఆశలను కూటమి ప్రభుత్వం ఒక డీఏ ఇస్తున్నామంటూ

ప్రకటించి నిరుత్సాహానికి గురిచేసింది. ఆ డీఏను సైతం చర్చల్లో వెల్లడించిన అంశాలకు విరుద్దంగా జీవో జారీ చేసి ఉద్యోగ,

ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశను

నింపారు. కూటమి ప్రభుత్వం జారీ చేసిన అసంబద్ధ డీఏ జారీపై జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు గుర్రుమంటున్నాయి.

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సింది నాలుగు డీఏలు, ఇచ్చింది మాత్రం ఒక డీఏనే. ఆ డీఏ ను సైతం చర్చల్లో ప్రస్తావించిన అంశాలకు విరుద్దంగా ఉత్తర్వులు జారీ చేశారు. ధరల పెరుగుదలతో చాలా సహజంగా ఇవ్వాల్సిన డీఏ ప్రకటనలో కూటమి ప్రభుత్వం హంగామా ఎక్కువ చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులను మరోమారు మోసగించింది. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్ల కోసం అనేక మోసపూరితమైన హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులను నట్టేట ముంచేశారు. కూటమి ప్రభుత్వం జారీ చేసిన అసంబద్ధమైన ఒక్క డీఏ జీవో వల్ల జిల్లాలోని 48 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఒక్కదానికి సీఎం స్థాయి చర్చలా...

కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఒక్క డీఏ కోసం ముఖ్యమంత్రితో చర్చలు అవసరమా అంటూ ఉద్యోగులు, టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 12వ పీఆర్‌సీపై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా మోసగించారని చెబుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు నష్టపోయామని, ఇంకెన్ని నెలలు నష్టపోవాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరు వల్ల ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉన్న ఈహెచ్‌ఎస్‌ రెఫరల్‌ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో హెల్త్‌కార్డుల వైద్యం ఆగిపోయిందని ఆవేదన చెందుతున్నారు. పోలీసులకు మాత్రమే ఈఎల్‌ ప్రకటించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.

అసంబద్ధంగా డీఏ జీవోలు

కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రకటించిన ఒక్క డీఏ అంశం పై జారీచేసిన జీవోలు 60 ,61 పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్వయంగా సీఎం చేసిన డీఏ ప్రకటనకు విరుద్ధంగా జీవోలు జారీ చేయడం మోసగించడమేనని మండిపడుతున్నారు. 4 డీఏలకు గాను ఒక డీఏను ఈ నెల 18న ప్రకటించి నిరాశ పరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 60, 61 డీఏ ఉత్తర్వుల్లో ఉద్యోగులకు 2024 జనవరి నుంచి 2025 సెప్టెంబర్‌ వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామనడం సమంజసం కాదని మండిపడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయులు విమర్శలు గుప్పిస్తున్నారు. చెల్లించాల్సిన 21 నెలల డీఏ బకాయిలను ఓపీఎస్‌ ఉద్యోగులకు పీఎఫ్‌ ఖాతాలలో, సీపీఎస్‌ ఉద్యోగులకు, పెన్షనర్‌లకు నగదుగా చెల్లిస్తామని సీఎం రాష్ట్ర నాయకుల చర్చల్లో ప్రకటించారని, అయితే అందుకు భిన్నంగా ఉత్తర్వులు విడుదల చేసి మోసగించారని చెబుతున్నారు. అసంబద్ధంగా జారీ చేసిన జీవోలను వెంటనే రద్దు చేసి నూతన ఉత్తర్వులను జారీచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement