పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
– ఘనంగా అమర వీరుల సంస్మరణ దినం
చిత్తూరు అర్బన్ : పోలీసులు లేని సమాజం ఎలా ఉంటుందో ఊహించడానికి సాధ్యపడదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం చిత్తూరులోని ఏఆర్ పోలీసు మైదానంలో నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు పనంగా పెట్టి, శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసుల సేవలు మరువలేనివని, వీళ్ల సేవలను వెలకట్టలేమన్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ.. 1959 నాటి ఘటన దురదృష్టకరమని.. నాటి నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ.. పోలీసులు దేశరక్షణకు సమానంగా సమాజంలో సేవలు అందిస్తున్నారన్నారు. అనంతరం అమర వీరుల కుటుంబ సభ్యులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. మేయర్ అముద, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చుడా చైర్‌పర్సన్ కటారి హేమలతతో కలిసి అమరవీరుల చిహ్నానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు రాజశేఖర్‌రాజు, శివానంద కిషోర్, సాయినాథ్, రాంబాబు, చిన్నికృష్ణ, మహబూబ్ భాష, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షులు ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
అమర వీరుల కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న
జిల్లా జడ్జి, చిత్రంలో కలెక్టర్ తదితరులు
అమర వీరుల కుటుంబ సభ్యులతో అధికారులు,
ప్రజా ప్రతినిధులు
పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం


