
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
నగరి : జాతీయ స్థాయి జూనియర్ బాల్ బాడ్మింటన్ పోటీలకు నగరి పట్టణ పరిధిలోని సాయివివేకానంద కళాశాలలో ఇంటర్ చదువుతున్న కేసీ తేజేస్ ఎంపికయ్యాడు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలలో నిర్వహించిన అంతర్ జిల్లాల జూనియర్ బాల్‌బాడ్మింటన్ పోటీల్లో చిత్తూరు జిల్లా నుంచి పాల్గొన్న తేజేష్ ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో పాటు స్టార్ ఆఫ్ ఆంధ్ర ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న తేజేష్‌ను బుధవారం కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.