
అధైర్యపడొద్దు అండగా నిలబడుతాం
కార్వేటినగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జీడీ నెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్త కృపాలక్ష్మితో పాటు బంగారు పాళ్యం పర్యటనలో అక్రమ కేసులో జైలుకు వెళ్లిన కార్యకర్తలు వినోద్‌కుమార్, మోహన్, టీడీపీ నాయకులు నరికి వేసిన మామిడి చెట్ల బాధితులు శంకర్‌రెడ్డి కలిశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో జీడీనెల్లూరు మండల కన్వీనర్ వెంకటరెడ్డి, గుణశేఖర్‌రెడ్డి, బలరామరెడ్డి, హరిబాబు, వెంకటేష్‌రెడ్డి, ఏకాంబరం, డిల్లిబాబు, రూపచంద్రరెడ్డి, సుధాకర్‌రెడ్డి ,గౌతం, త్యాగరాజులురెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

అధైర్యపడొద్దు అండగా నిలబడుతాం