ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి | - | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి

Sep 18 2025 7:14 AM | Updated on Sep 18 2025 7:14 AM

ప్రపం

ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి

చిత్తూరు కలెక్టరేట్‌ : విశ్వకర్మను ప్రపంచంలోనే మొదటి వాస్తు శిల్పిగా భావిస్తారని జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. విరాట్‌ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. విశ్వకర్మ కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజ భవనాన్ని నిర్మించారన్నారు. ప్రజా ప్రయోజనకరంగా వాస్తు ప్రకారం పట్టణాలు, భవనాల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు విశ్వకర్మ కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌, నగర మేయర్‌ అముద, బీసీ కార్పొరేషన్‌ రాష్ట్ర జేడీ శ్రీధర్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిభాషా, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పీపీపీ విధానంలో పాత బస్టాండు !

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు పాత బస్టాండు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక్కడున్న ఖాళీ స్థలాన్ని పీపీపీ విధానంలో ఇంటిగ్రేడ్‌ బస్టాండుగా నిర్మించడానికి బుధవారం చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మేయర్‌ అముద, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ నాయుడు, కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ కలిసి.. ఓ ప్రైవేటు కన్సల్టెంట్‌ ప్రతినిధితో సమీక్షించారు. ఇప్పటికే పీపీపీ విధానంలో బస్టాండును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, త్వరలోనే ఆమోదం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోమారు బస్టాండు అంశం తెరపైకి రావడం, ఏం జరుగుతుందోనని వ్యాపారులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

క్విజ్‌ పోటీలు సద్వినియోగం చేసుకోండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని విద్యార్థులు వికసిత్‌ భారత్‌ క్విజ్‌ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన అధికారి ప్రదీప్‌ కుమార్‌ అన్నారు. నగరంలోని ఆ కార్యాలయంలో వికాస్‌ దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని 15 రోజుల పాటు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ గణాంక అధికారి బాబురెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని విద్యార్థులు మై భారత్‌ వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ క్విజ్‌ పోటీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మై భారత్‌.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం ఆ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సపోర్ట్‌ అధ్యక్షులు జోసెఫ్‌ రాజ్‌, పలువురు వలంటీర్లు పాల్గొన్నారు

శాశ్వత ప్రాతిపదికన

ఉద్యోగోన్నతులు కల్పించండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని స్కూల్‌ అసిస్టెంట్‌లకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలని స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తమరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ పోస్టింగ్స్‌ ఇవ్వక ముందే హైస్కూల్‌ ప్లస్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలను ఉద్యోగోన్నతి కల్పించి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రక్రియ అనంతరం డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగ్స్‌ ఇవ్వాలన్నారు. దసరా సెలవులు ఈనెల 21వతేదీ నుంచి ప్రకటించాలన్నారు. కరువు భత్యం వెంటనే విడుదల చేసి ఇంటీరియం రిలీఫ్‌ను దసరా కానుకగా ఇవ్వాలని కోరారు.

ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి 
1
1/3

ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి

ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి 
2
2/3

ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి

ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి 
3
3/3

ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement