
బోయకొండ.. పుష్ప శోభితం
– 8లో
ఆర్టీసీ బస్సు.. సీఎన్‌జీగా మార్పు!
ఆర్టీసీ డీజిల్ ఇంజిన్‌ను సీఎన్‌జీగా చిత్తూరు డిపోలో మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా నడిపారు.
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయానికి నూతన శోభ నెలకొంది. బుధవారం బెంగళూరు దేవనహళ్లి లక్ష్మీ ఫ్లవర్ డెకరేషన్స్ నిర్వాహకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. రంగు రంగు పూలతో పాటు పూల సువాసనలు కొత్త దనంతో ఆలయం భక్తులను ఆకట్టుకొంది. 17 సంవత్సరాలుగా ఏటా క్రమం తప్పకుండా దసరా మహోత్సవాలకు ముందు వారం వీరు ఆలయాన్ని బెంగళూరు నుంచి పూలను తీసుకొచ్చి వారే స్వయంగా పూలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా జరుగుతోంది. ఆలయం లోపలే కాకుండా ఆలయం ముందు భాగం పరిసరాల్లో పూలతో అలంకరించడంతో నూతన శోభ సంతరించుకొంది. తరువాత ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వీరిని ఆలయ ఈఓ ఏకాంబరం సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

బోయకొండ.. పుష్ప శోభితం