
11న వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 11న తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి మల్లారపు వాసు తెలిపారు. ఈ మేరకు బుధవారం తిరుపతి మారుతీనగర్‌లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం వద్ద పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్‌కె. రోజా, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేగౌడ్, డాక్టర్ సునీల్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, మేయర్ డాక్టర్ శిరీషను కలిసి ఆహ్వానించారు. ఈ సమావేశానికి పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టిజెఆర్. సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు పాల్గొంటారని రాజేంద్ర తెలిపారు. సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ విభాగం నాయకులు తరలిరావాలని కోరారు.