
ఎంపీ మిథున్ విడుదల కావాలని ప్రార్థన
బంగారుపాళెం: అక్రమ మద్యం కేసు నుంచి ఎంపీ మిథుర్‌రెడ్డి నిర్ధోషిగా బయటకు రావాలని కోరుతూ స్థానిక ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం బంగారుపాళెం ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కో–ఆప్సన్ సభ్యుడు ఫిరోజ్‌అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబంపై రాజకీయ కుట్రతో తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. సంక్షేమ పథకాలను గాలికి వదలి వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలు చేపట్టడం తగదన్నారు. మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాకీర్, ముస్లిం నాయకులు అహ్మద్‌బాషా, రియాజ్, చందులాల్ పాల్గొన్నారు.