ఇల్లు దగ్ధం
గుడిపాల మండలంలోని కట్టకింద పల్లెలో విద్యుదాఘాతానికి ఇల్లు దగ్ధమైంది. రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.
బోయకొండ ఇంటి దొంగలపై విచారణ
మద్దతు ధరపై..
మామిడి మద్దతు ధరపై స్పష్టత లేక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025
చిత్తూరు కలెక్టరేట్ : మహిళలకు బాబు నైజంపై అవగాహన ఉంది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు మారిన మనిషినంటూ జనాన్ని నమ్మించాడు. అమలుకు నోచుకోని హామీలను గుప్పించి అధికారం చేజిక్కించుకున్నాడు. అంతే షరా మామూలే హామీలను గాలికొదిలేసి నమ్మి ఓటు వేసిన మహిళలకు శఠగోపం పెట్టేశాడు. మహిళలను మహాశక్తి మంతులను చేస్తానని నమ్మబలికి ఆడబిడ్డ నిధి పథకంతో 18 ఏళ్లు నిండిన కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని ప్రగల్భాలు పలికాడు. మోసపూరిత హామీలతో మహిళలను నమ్మించి ఓట్లు దండుకుని అధికారం చేపట్టాడు. బాబు సర్కారు ఆడబిడ్డ నిధికి మంగళం పాడేస్తున్నట్లు మంత్రి ద్వారా సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రాను అమ్మాల్సిందే...!
కూటమి అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తామన్న హామీలను బాబు సర్కార్ గాలికి వదిలేసింది. సూపర్ సిక్స్ హామీలలో ఆడపడుచులకు సంబంధించి మహాశక్తిలో భాగంగా బాబు ప్రకటించిన ఆడబిడ్డ నిధిపై ఏడాది గడుస్తున్నా నోరు మెదపలేదు.
దీంతో ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారులే అంటూ ఆశతో ఎదురు చూస్తున్న మహిళలకు ఒక్కసారిగా బాబు సర్కార్ జలక్ ఇచ్చింది. స్వయానా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓ సభలో ఆడబిడ్డ నిధి అమలుపై ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుందని బహిరంగంగా ప్రకటించేశారు. దీంతో ఆడబిడ్డ నిధికి మంగళం పాడేశారని, తమను నమ్మించి మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆటో దహనం కేసుపై
ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
పుత్తూరు : మున్సిపాలిటీ పరిధిలోని వినాయకపురం ఎస్టీ కాలనీలో ఈనెల 18వ తేదీ రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుడు రాజయ్య ఆటోను దుండగులు కాల్చివేసిన ఘటనపై బాధితుడు బుధవారం ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్‌రావును కలిసి ఫిర్యాదు చేశారు. రేణిగుంటలోని గిరిజన గురుకుల పాఠశాల తనిఖీ నిమిత్తం వచ్చిన ఎస్టీ కమిషన్‌ను వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, బాధితుడు రాజయ్య కలిసి ఆటో దహనం కేసులో నిందితులను త్వరగా గుర్తించి తమకు తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీనిపై కమిషన్ శంకర్‌రావు మాట్లాడుతూ.. పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తే ఎస్టీ కమిషన్ తగిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోదని స్పష్టం చేశారు. గిరిజన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. ఆస్తి నష్టం చర్యలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కూడా నమోదుకు సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు.
పరిసరాల పరిశుభ్రత
ప్రజల బాధ్యత
కార్వేటినగరం : పరిసరాల పరిశుభ్రత బాధ్యత ప్రజలదేనని జడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు అన్నారు. బుధవారం మండల పరిధిలోని సీడీ కండ్రిగలో నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయు డు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక ప్రజలే బాధత్య వహించాలని, అప్పుడే చెత్త రహిత గ్రామాలు ఏర్పాటు అవుతాయన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం అందించిన బుట్టలలో తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశు ద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. జి ల్లా స్థాయిలో విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే టీకేఎం పేట గ్రామంలో పర్యటించి మురుగు నీరు నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రమౌళి, కార్యదర్శులు, ఏకాంబరం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పుత్తూరు సీఐ వీఆర్‌కు!
పుత్తూరు : స్థానిక సీఐ కే.బీ.సురేంద్రనాయుడు వీ ర్ (వేకన్సీ రిజర్వు)కు బదిలీ అయ్యారు. సోమ వారం ఎస్పీ కార్యాలయం నుంచి వీర్ ఆదేశాల ను అందుకున్న సీఐ అదేరోజు ఇక్కడి నుంచి రిలీ వ్ అయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీర్ బదిలీ కేవలం రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అ యితే సీఐపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చిన ట్లు అందుకు తగిన ఫలితమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి మాటలు బాధపెట్టాయ్...
సార్వత్రిక ఎన్నికలలో అధికార వాంఛతో కూటమి నేతలు మహిళలను మభ్యపెట్టి పథకాలను ప్రకటించి అమలు చేసి తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా పథకాల ప్రస్తావనే రావడంలేదు. ఉచిత బస్సుతో పాటు ఆడబిడ్డ నిధిని నిర్వీర్యం చేశారు. లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న తరుణంలో మంత్రి బహిరంగ సభలు పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలి అంటూ వెటకారంగా మాట్లాడటం ఎంతో మందిని బాధించింది. – జయంతి, చిత్తూరు నగరం
న్యాయం చేస్తారని ఓటు వేశాం
నేను దినసరి కూలిని. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన నాయకులు ఇంటింటికీ తిరిగి చంద్రబాబు సీఎం అయితే ఆడబిడ్డ నిధి పథకం కింద కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. దీంతో నమ్మి ఆశతో ఓటు వేశాం. ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. సంవత్సరం గడిచింది. న్యాయం చేస్తారని నమ్మి మోసపోయాం.
– విజయ, కార్వేటినగరం
మోసం చేయడం న్యాయమా..?
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చకుండా మహిళలను వంచించడం దారుణం. ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని కూటమి నేతలు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ఆ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు. మహిళలు ఎంతో నమ్మకంగా ఇచ్చిన అధికారాన్ని అంతే నమ్మకంతో ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేయాలి. – ధనలక్ష్మి, చిత్తూరు నగరం
నేడు పీవీకేఎన్‌లో కౌన్సెలింగ్
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24వ తేదీన ఒప్పంద అధ్యాపకులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గత విద్యాసంవత్సరంలో 30–04–2025 వరకు పనిచేసి న ఒప్పంద అధ్యాపకుల కాలాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరానికి కొనసాగించేందుకు కౌన్సెలింగ్ ని ర్వహిస్తామన్నారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియకు జాయింట్ కలెక్టర్ హాజరవుతారని వెల్లడించారు.
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో టికెట్ల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం చూపారు. సాక్షిలో ఇంటిగుట్టు రట్టు కథనంపై స్పందించిన ఈఓ ఏకాంబరం, ఎస్‌ఐ నాగేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు. బోయకొండ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి పెద్ద భోగం మొక్కులు చెల్లించేందుకు భక్తులకు విక్రయించిన రూ.200 టికెట్ల కౌంటర్ ఫైళ్లను పరిశీలన చేపట్టారు. ఒక్కొక్క టికెట్ల పుస్తకంలో వంద టికెట్లు ఉన్నాయని వాటిలో అధికారుల సంతకాలు లేకుండానే భక్తులకు టికెట్లు ఎలా విక్రయిస్తారని పోలీసులు ప్రశ్నించారు. టికెట్లు విక్రయించగా కార్యాలయానికి కౌంటర్ ఫైల్ వచ్చినప్పుడు ఎందుకు పరిశీలించలేదనే అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు బాధ్యులైన ఆలయ సిబ్బందిని పోలీసులు విచారణ చేపట్టారు. ఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురు సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు బోధించాల్సిన టీచర్ల చేత బియ్యం మూటలు మోయిస్తున్నారనే సమస్యపై సాక్షి దినపత్రికలో ఈనెల 23న అయ్యోర్లకు బియ్యం మోత అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనం పై డీఈవో వరలక్ష్మి స్పందించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు బియ్యం మోసుకెళ్లాలని ఆదేశించలేదన్నారు. ఇందుకు సమగ్రశిక్ష శాఖ పరిధిలో పని చేసే సిబ్బందికి బాధ్యతలు ఉన్నాయన్నారు. అయితే పలు మండలాల్లో టీచర్లకు బియ్యం తీసుకెళ్లాలని ఎంఈవోలు ఆదేశించడం తగదన్నారు. ఈ విషయంపై ఆరా తీసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా స్పందించిన విద్యాశాఖ అధికారులు అలసత్వం వహించిన రెండు మండలాల ఎంఈవో–2కు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
మహాశక్తి ఆడబిడ్డ నిధికి కూటమి మంగళం ?
ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనన్న మంత్రి
మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళలు
ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్న కూటమి
ఆడబిడ్డలను నమ్మించి మోసం చేసిన బాబు సర్కారు
ప్రజలను నమ్మించి..గద్దెనెక్కాక నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని సీఎం చంద్రబాబు మరోమారు చాటుకున్నారు. మహాశక్తిలో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధిపై ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఉలుకూ పలుకులేదు. ఎప్పుడో ఒకసారి ఇస్తారులే అని మహిళలకు ఏ మూలో ఆశ ఉండేది..కానీ ఆడ పడుచుల ఆశలపై మంత్రి అచ్చెన్నాయుడు నీళ్లు గుమ్మరించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించడంపై మహిళా లోకం భగ్గుమంటోంది. మంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక పథకం ఎగవేత కుట్ర దాగుందని మహిళలు ఆవేదన చెందుతున్నారు.
ఎన్నికల సమయంలో తెలియదా ?
అధికార దాహంతో హామీలను గుప్పించి మహిళలను మభ్యపెట్టి అధికారం చేపట్టారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి తీరుతా అంటూ చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు చేతులెత్తేసి మా వల్లకాదు అంటూ చెబుతున్నారు. సాక్షాత్తు మంత్రి అచ్చెన్ననాయుడు ఆంధ్రాను అమ్మితేగాని ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమంటూ తేల్చిచెప్పడం విడ్డూరంగా ఉంది. హామీలు గుప్పించిన నాడు ఈ విషయం తెలియదా.
– దీప, పాల సముద్రం మండలం
మహిళల ఆగ్రహం తెలుస్తుంది..
కూటమి సర్కార్ ఎన్నికల హామీలను అమలు చేయకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. అధికారం కోసం మహిళలను మభ్యపెట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని షరతులు లేకుండా అమలు చేస్తామని చెప్పారు. నేడు అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనం. జిల్లాలో లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఎదురు చూస్తున్నారు.
– సునీత, పాలసముద్రం
మోసం చేయడం దారుణం
ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమని సాక్షాత్తు మంత్రి ప్రకటించడం ఆశ్చర్యమేసింది. ఎన్నికల సమయంలో అమలు చేయలేమని తెలిసీ హామీ ఇచ్చారంటే మహిళలను వంచించి మోసం చేసి ఓట్లు దండుకుని అధికారం చేపట్టాలనే లక్ష్యంతో హామీలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని ప్రతి ఇంటిలో మహిళ ఈ పథకం అమలు చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు.
– కవిత, నగరి
రూ. 2,069.38 కోట్ల బకాయిలు చెల్లించాలి
జిల్లా వ్యాప్తంగా 2025 జనవరి వరకు అధికారిక నివేదికల ప్రకారం 18 ఏళ్ల పైబడి 100 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు 11,49,661 మంది ఉన్నారు. బాబు సర్కారు ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.2069.38 కోట్లు బకాయి పడింది. అంటే సరాసరి ఒక్కో మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాదిగా పథకాల అమలులో గోల్‌మాల్ చేస్తూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాల అమలుపై నోరు మెదపలేదు. ఇటీవల మంత్రి చాలా స్పష్టంగా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే పరిస్థితి లేదని బాహాటంగా చెప్పడంతో కూటమి సర్కారు నైజం బయటపడిందని, రానునున్న రోజులలో ప్రజా వ్యతిరేకతను బాబు సర్కారు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు ఇలా..
నియోజకవర్గం ఆడబిడ్డ నిధికి అర్హులు ఏడాదిగా అందాల్సిన మొత్తం
(రూ.కోట్లల్లో)
పుంగనూరు 1,71,089 రూ.307.96
నగరి 1,53,112 రూ.275.60
జీడీ నెల్లూరు 1,54,203 రూ.277.56
చిత్తూరు 1,48,682 రూ.267.62
పూతలపట్టు 1,59,027 రూ.286.24
పలమనేరు 1,97,841 రూ.356.11
కుప్పం 1,65,707 రూ.299.29
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు