వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

Jul 17 2025 4:00 AM | Updated on Jul 17 2025 4:00 AM

వృద్ధ

వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

పుంగనూరు : పట్టణంలోని కట్టకిందపాళెం వద్ద ఓ వృద్ధురాలి మెడలో గొలుసును ఇద్దరు యువకులు అపహరించారు. వివరాలు.. బుధవారం ఉదయం సుమారు 7 గంటలకు భాగ్యలక్ష్మీ(70) అనే వృద్ధురాలి మెడలో నుంచి 24 గ్రాముల బొట్టుచైనును ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. దీంతో ఆమెకు కిందపడి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు ఘటనాస్థలానికి వెళ్లి వృద్ధురాలిని విచారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని బెంగళూరుకు చెందిన భక్తులు కారులో అధికవేగంగా వెళుతుండగా వినాయక స్వామి ఆలయం వద్ద కారు అదుపుతప్పి చెట్టు ఢీకొంది. ఈ ప్రమా దంలో కారు ముందు భాగం ధ్వంసం కాగా.. అందులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న ఘాట్‌ రోడ్డు సిబ్బంది వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ 
1
1/1

వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement