
దొంగ అరెస్ట్
కుప్పం: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. తమిళనాడు రాష్ట్రం, తిరుపత్తూరు జిల్లా, కరంబూర్ గ్రామానికి చెందిన శక్తివేల్ దొంగతనాలకు పాల్పడేవాడని, ఈ క్రమంలో ఆంధ్రాలో అతనిపై ఇప్పటికే 14 కేసులు నమోదైనట్లు తెలిపారు. కుప్పం సర్కిల్ పరిధిలో కూడా అతనిపై నాలుగు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం పోలీసు నిఘా ఉంచి అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిదింతుడి వద్ద నుంచి 5 తులాల బంగారం, కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రామకుప్పం మండలం, ననియాల గ్రామానికి చెందిన ఇద్దరు బియ్యం వ్యాపారులపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఇదిలా వుండగా గోవిందరాజులు, మాణిక్యం తమిళనాడు బియ్యాన్ని కొనుగోలు చేసి ఓ బియ్యం వ్యాపారికి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
దళితులంటే అలుసా?
చిత్తూరు కలెక్టరేట్ : నగరి మండలం, గుండ్రాజకుప్పం దళితవాడ ప్రజలను ఆదుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. గుండ్రాజ కుప్పం దళితవాడకు ఆనుకొని ఉన్న కొండను క్వారీ యజమానులకు అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యను పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ జీడీ నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలం, సాయినగర్, ఎస్‌ఆర్‌ఆర్ కండ్రిగ, వనదుర్గపురం తదితర గ్రామాల్లో కొండలను తొలిచి టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని తోడేస్తున్నారని, అక్రమంగా తమిళనాడుకు తరలించి సొమ్ము చేస్తుకుంటున్నారని చెప్పారు.

దొంగ అరెస్ట్