
టీబీని నివారిద్దాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): 2025 ఆఖరి కల్లా టీబీని దేశం నుంచి తరిమికొట్టాలని సెంట్రల్ టీబీ డివిజన్ డిప్యూటీ కమిషనర్ భవానిసింగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లాలో జరుగుతున్న టీబీ ముక్త భారత్ కార్యాక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. టీబీని సమూలంగా నిర్మూలించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ షుఘర్, తాగుడు అలవాటు ఉన్నవారికి, పాత టీబీ రోగులకు, హెచ్‌ఐవీ రోగులందరికీ టీబీ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. అనంతరం జిల్లా టీబీ నివారణ అధికారి వెంకటప్రసాద్ మాట్లాడారు. ప్రతి సచివాలయ పరిధిలో రోజూ 10 మందికి టీబీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామన్నారు. అంతకుముందు జిల్లా టీబీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పూతలపట్టులోని వేపనపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జీడీ నెల్లూరు మండలంలోని నెల్లేపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్‌ను తనిఖీ చేశారు. ఆయన వెంటన కేంద్ర బృందం సభ్యులు దర్మారావు, గంగాధర్, శ్రీ ధీరజ్, టీబీ శాఖ అధికారులు మనోహర్‌రెడ్డి, జశ్వంత్, సంతోష్ పాల్గొన్నారు.