జనావాసాల్లోకి ఏనుగులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పాళెం పంచాయతీలో తిష్ట వేసిన 14 ఏనుగుల గుంపు చుట్టు పక్కల పొలాల్లో రోజూ ఏదోఒకచోట పంటలపై పడి తీవ్ర నష్టం కలిగిస్తోంది. రోజూ మామిడి తోపుల్లో కాయలు తింటూ కొమ్మ లను విరిచేయడం, కంచె కూసాలను, డ్రిప్ పై పులను నాశనం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా మంగళవారం తెల్లవారు జామున పాళెం పంచాయతీలోని జూపల్లె, కోటపల్లె గ్రా మాల్లోకి ప్రవేశించి ఇళ్ల ముందర ఉన్న అరటి చెట్లను ధ్వంసం చేశాయి. రోడ్ల పైన తిరు గుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఏనుగులను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
కుప్పం: సీఎం చంద్రబాబు నాయుడు బుధ వారం కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. సోమ వారం జిల్లా పోలీసు యంత్రాగంతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటించే ప్రాంతాల్లో పోలీసు బలగాలను అధికంగా మోహరించాలన్నారు. సమీక్షలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివనందకిషోర్, కుప్పం డీఎస్పీ పార్థ సారిథి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
సీఎం కుప్పం పర్యటనలో మార్పు
శాంతిపురం: సీఎం చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన ఒక్క రోజు ఆలస్యంగా ప్రారంభంకానుంది. మంగళవారం ఇక్కడికి రావాల్సిన ఆయన బుధవారం విచ్చేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం 12.30కి సీఎం తుమ్మిశి వద్ద ఉన్న హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వచ్చి 12.50కి తులసినాయనపల్లి వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూలు వద్దకు చేరుకుని బహిరంగసభ, పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.35కు తిమ్మరాజుపల్లి చేరుకుని రాత్రి 7 గంటల వరకూ ఇంటింటికీ వెళ్లి 26 కుటుంబాలను నేరుగా కలవనున్నారు. గురువారం ఉదయం 10.35కు కుప్పం ఏరియా ఆస్పత్రి చేరుకుని టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15కు కడపల్లి వద్ద తన నివాసంలో అధికారిక సమిక్ష నిర్వహిస్తారు. 2.30 నుంచి 4 గంటల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం తిరుగు ప్రయాణంలో తుమ్మిశి వద్ద హెలీప్యాడ్ చేరుకుని బెంగళూరుకు వెళ్తారని తెలిపారు.
జనావాసాల్లోకి ఏనుగులు


