చిత్తూరు నూతన డీవైఈఓ ఇందిర
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని చిత్తూరు డీవైఈఓ ఇందిర అన్నారు. బుధవారం పాత కలెక్టరేట్‌లోని డీవైఈఓ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. మొదటగా డీఈఓ వరలక్ష్మిని ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు డివిజన్‌లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంపొందించేందుకు చర్యలు చేపడుతామన్నారు.
డివిజన్ పరిధిలో పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతులను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం నూతన డీవైఈఓను ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటామోహన్, జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి, గణేష్, హెచ్‌ఎం, ఎంఈఓ సంఘాల ప్రతినిధులు త్యాగరాజులురెడ్డి, రుక్మిణమ్మ, కోమల, అరుణ్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, భాస్కరరావు, సోము, తులసిబాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ