● జిల్లాలో అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● నిరుపయోగంగా కియోస్క్‌లు ● అన్నదాతకు అందని పథకాలు ● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పక్కాగా పనిచేసిన ఆర్‌బీకేలు ● 503 రైతు భరోసా కేంద్రాలకు గాను 340 చోట్ల సొంత భవనాలు ● రూ.109 కోట్లకు గాను రూ.74.12 కోట్లు వెచ్ | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● నిరుపయోగంగా కియోస్క్‌లు ● అన్నదాతకు అందని పథకాలు ● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పక్కాగా పనిచేసిన ఆర్‌బీకేలు ● 503 రైతు భరోసా కేంద్రాలకు గాను 340 చోట్ల సొంత భవనాలు ● రూ.109 కోట్లకు గాను రూ.74.12 కోట్లు వెచ్

May 5 2025 8:08 AM | Updated on May 5 2025 8:08 AM

● జిల్లాలో అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● నిరుపయో

● జిల్లాలో అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● నిరుపయో

కార్వేటినగరం : అన్నదాతకు చేయూతనందించేందుకు ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ దుస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల ఇంటి ముంగిటకే సేవలు అందించాలనే ఉదేదద్దేేశంతో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచి జరిగే పనులను సైతం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చింది. తర్వాత రైతులకు కనీస సేవలు కూడా అందించకుండా ఇబ్బంది పెడుతోంది.

మూలపడిన కియోస్క్‌ యంత్రాలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి రైతు భరోసా కేంద్రంలో కియోస్క్‌ యంత్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులు ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగుల మందులు బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పించింది. అలాగే వాతావరణంలో మార్పులు తెలుసుకుని, అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. పంట ఉత్పత్తుల మద్దతు ధరలు కూడా ఈ యంత్రాల ద్వారా రైతులు తెలుసుకునే వారు. ప్రస్తుతం రైతు సేవాకేంద్రాల్లో కియోస్క్‌ యంత్రాలను మూలనపడేశారు. వీటి ద్వారా రైతులకు అందే సేవలను సైతం నిలిపేశారు.

ఇప్పటికీ అదే నిర్లక్ష్యం

జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 503 రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే)లు ఏర్పాటు చేసింది. రూ.109 కోట్లు మంజూరు చేసి సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.74.12 కోట్లు వెచ్చించి పలు గ్రామాల్లో 340 పక్కా భవనాలు నిర్మించింది. మరో 163 భవనాలను వివిధ దశల్లోకి తీసుకువచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులను నిలిపివేసింది. రైతు సేవా కేంద్రాలని ప్రకటించి సేవలను దూరం చేసింది. కేవలం ధాన్యం కొనుగోళ్లకు మాత్రం ఆయా భవనాల్లో కొన్నింటిని వినియోగిస్తోంది. ఆయా కేంద్రాల్లోని సిబ్బందిని సర్వేలు, పింఛన్ల పంపిణీ అంటూ బయటకు పంపేస్తోంది. అన్నదాతలకు అందుబాటులో లేకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.

గతంలో నిత్యం అందుబాటులోనే..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆయా ఆర్‌బీకేల్లో ఉద్యానశాఖ అధికారి, వ్యవసాయాధికారి, అగ్రికల్చర్‌ సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉండేవారు. ఎప్పటికప్పుడు సలహాలు అందించేవారు. అప్పటి సర్కారు సైతం రైతు భరోసా కేంద్రాల నిర్వహణకు నిధుల సమస్య లేకుండా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సేవాకేంద్రాల నిర్వహణను గాలికి వదిలేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement