ట్రాన్స్‌కో వర్క్‌ ఆర్డర్లు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో వర్క్‌ ఆర్డర్లు పూర్తి చేయాలి

May 25 2024 1:30 AM | Updated on May 25 2024 1:30 AM

చిత్తూరు కార్పొరేషన్‌: ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వర్క్‌ఆర్డర్లను ఏఈలు త్వరితగతిన పూర్తి చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 2020–2021, 2021–2022కు సంబంధించి రూ.101 కోట్ల విలువైన 5100 వర్క్‌ఆర్డర్లను పూర్తి చేయాల్సి ఉందన్నారు. పలుమార్లు హెచ్చరిస్తున్నా పని తీరులో మార్పు రావడం లేదన్నారు. మదనపల్లె, చిత్తూరు, పుంగనూరు డివిజన్ల పరంగా వర్క్‌ఆర్డర్లు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సంబంధిత ఏఈలు పనితీరు మార్చుకోకుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

పూతలపట్టు: మండలం మూర్తిగానూరులో నెలకిందట ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వడివేలు(38) అటవీప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఉండగా గ్రామస్తులు శుక్రవారం గుర్తించారు. సీఐ సుదర్శన ప్రసాద్‌ కథనం మేరకు.. వడివేలు చాలా సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నెల కిందట ఇంటి నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా వెళ్లిపోయాడు. శుక్రవారం గ్రామ సమీపంలోని నువ్వులకొండలో చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి శవాన్ని గుర్తించి పశువుల కాపరి గ్రామస్తులకు తెలియజేయగా, స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, ఆ మృత దేహం వడివేలుదేనని నిర్థారించారు. ఉరేసుకుని చాలా రోజులు కావడంతో మృతదేహం బాగా కుళ్లిపోయి ఉంది. అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుబసభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement