
చిత్తూరు కలెక్టరేట్: మండే ఎండలతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిత్తూరులో గురువారం అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఉక్కపోత
మండే ఎండలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రతతో పాటు ఉక్క పోత మొదలవుతోంది. ఇక మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు తీవ్ర ఎండలు నమోదవుతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతూ దూసుకొస్తున్నాడు. జనం వీధిలోకి రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నికల సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.