సీఎం జగన్‌.. మాటపై నిలబడే నేత | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌.. మాటపై నిలబడే నేత

Published Fri, Apr 12 2024 1:50 AM

విజయపురం మండలం మహారాజపురంలో పార్టీలో చేరిన నేతలతో మంత్రి ఆర్కే రోజా  
 - Sakshi

● అందుకే మనస్ఫూర్తిగా చేరుతున్నాం ● సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉంటాం ● నగరి, పలమనేరు, కుప్పంలో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు ● కండువాలు వేసి ఆహ్వానించిన మంత్రి రోజా, ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్‌

విజయపురం : ‘‘గత ఎన్నికల్లో ఇచ్చిన మాటపై నిలబడ్డారు.. ఇచ్చిన హామీలు నెరవేర్చారు.. అందుకే మాట తప్పే పార్టీలో ఉండదలచుకోలేదు.. సీఎం జగన్‌ మాటపై నిలబడే నేత.. అందుకే వచ్చే ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉందామని పార్టీలోకి వస్తున్నాం..’’ అంటూ విజయపురం మండలం మహరాజపురం, పాతర్కాడు పంచాయతీ గొల్లపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు అన్నారు. గురువారం వారు మంత్రి ఆర్‌కే రోజా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా క్షూరికాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు చంద్రయ్య ఆధ్వర్యంలో మహావీరపురం గ్రామానికి చెందిన బాబు, మణి, దాము, లక్ష్మయ్య, మునస్వామి వీరితో పాటు ఇరవై కుటుంబాలకు చెందిన వారు మంత్రి రోజా సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జయప్రకాష్‌ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు రాధాకృష్ణ, గోపి, కవిత, తరుణ్‌, పురుషోత్తం, శాంతిలక్ష్మి, శాంతిలక్ష్మి, చిట్టెమ్మ దేశమ్మ, పి. కృష్ణయ్య, ఎం.చంద్రయ్య వెంకటమందడి, రమ్య, రేవతి, తేజస్విని, పురుషోత్తం తదితరులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా మంత్రి రోజా వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జంబాడ నుంచి కనకమ్మ సత్రానికి వెళ్లే దారి గురించి గతంలో ఎవరూ పట్టించుకోలేదని, మంత్రి ఆర్కేరోజా రూ.2 కోట్లు నిధులతో రోడ్డు వేయించారని తెలిపారు. నాడు–నేడు పథకంలో గ్రామంలోని పాఠశాల సుందరంగా మారిందన్నారు. అంగన్‌వాడీ సెంటర్‌కు సొంత భవనం నిర్మించారన్నారు. పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ధైర్యంగా చెప్పగలుగుతున్నారని తెలిపారు. ఎందుకంటే సీఎం జగన్‌ ఇచ్చిన మాటపై నిలబడుతున్నారని నిరూపితమైందని, అందుకే మనస్ఫూర్తిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గోపి, ఎంపీపీ జమున వెంకటేష్‌, జెడ్పీటీసీ వెంకటేష్‌, వైస్‌ ఎంపీపీ బాలాజీ, శ్రీహరిపురం సర్పంచ్‌ రగేష్‌, జంబాడ సర్పంచ్‌ భాస్కర్‌, కోసలనగరం ఎంపీటీసీ కన్నెమ్మ, ఇళ్లత్తూరు సర్పంచ్‌ గోపి, ఆర్‌బీకే చైర్మన్‌ గుణశేఖర్‌ రెడ్డి, నాయకులు కృష్ణమ శెట్టి, దేవా, సతీష్‌, కుమార్‌,కుమార్‌, మోహన్‌ రాజు, బాబు, రాజగోపాల్‌ శివరాజ్‌ భాస్కర్‌ రెడ్డి ఆనంద్‌, శివరాజ్‌, వెంకటేశులు చంద్రయ్య, దాము, వెంకటరమణ, పాండియన్‌, కిరుబ, గుణశేఖర్‌ రెడ్డి, మునస్వామి హరి నాయుడు, రవి నాయుడు, శ్రీరాముడు రెడ్డి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి..

పెద్దపంజాణి: మండలంలోని రాయలపేట, తుర్లపల్లి, చామనేరు గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే వెంకటేగౌడ గురువారం వారికీ వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి కృషి చేయాలని, కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని వారికి సూచించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమపాలన, ఎమ్మెల్యే వెంకటేగౌడ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో రెడ్డెప్ప, దిలీప్‌, అనీల్‌, యోగానంద, వెంకటేష్‌, ఏకాంబరం, వెంకటాచలపతి, తుర్లపల్లి పంచాయతీ నుంచి జన్మభూమి కమిటీ సభ్యుడు సతీష్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ టి.వెంకటాచలపతి, హేమాద్రి, అమర, చామనేరు నుంచి జనసేన నేత లోకేష్‌ ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సుహేబ్‌, మూకయ్య, సర్పంచ్‌ మురళి, పార్టీ నాయకులు హేమచంద్ర, ఇమాంవళి తదితరులు పాల్గొన్నారు.

పలమనేరులో..

పలమనేరు: మండలంలోని మొరం పంచాయతీ చిన్నపేట కురప్పల్లికి చెందిన పలువురు టీడీపీ నాయకులు గురువారం స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ సమక్ష్యంలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తాము టీడీపీ విధానాలు నచ్చకే వైఎస్సార్‌సీపీలో చేరామని పార్టీలో చేరిన టీడీపీ బూత్‌ కమిటీ మెంబర్‌ సుందర్‌రాజు, నటరాజ్‌, గోవిందరాజ్‌, నవీన్‌, రాజు, సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ హేమంత్‌కుమార్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘ అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి, నాయకులు రాజేష్‌, దయానందగౌడ తదితరులు ఉన్నారు.

రామకుప్పంలో..

రామకుప్పం: మండలంలోని మణీంద్రం గ్రామానికి చెందిన టీడీపీ నేత కుమార్‌ తన కుటుంబంతో సహా గురువారం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా కుమార్‌ కుటుంబ సభ్యులకు భరత్‌ పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కుమార్‌ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలోకి చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ సుబ్రమణ్యం రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నితిన్‌ రెడ్డి, ఎంపీపీ సుబ్రమణ్యం, పార్టీ కో–కన్వీనర్‌ చంద్రారెడ్డి, నేతలు చంద్రమోహన్‌ రెడ్డి, బోర్‌వెల్‌ చెంగారెడ్డి, రఘు, శివ, ప్రచార కార్యదర్శి కేశవరెడ్డి పాల్గొన్నారు.

1/2

2/2

 
Advertisement
 
Advertisement