
ఊరందూరుకు బయలుదేరుతున్న స్వామి,అమ్మవార్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని బుధవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి,అమ్మవార్లు మండలంలోని ఊరందూరులో వెలసిన శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. అందులో భాగంగా ఉదయం శ్రీస్వామి,అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ఽవేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టింపజేశారు. అనంతరం ఊరేగింపుగా స్వామి, అమ్మవార్లు ఊరందూరు నీలకంఠేశ్వరాలయానికి చేరుకున్నారు. అక్కడ పూజల అనంతరం పానగల్, అగ్రహారం, సన్నిధివీధి, మాడవీధుల గుండా ఆలయానికి వేంచేపు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో సాగర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.