
డీసీహెచ్‌ఎస్‌తో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్
కుప్పం : ప్రభుత్వంపై బురదచల్లేందుకే కుప్పం వంద పడకల ఆస్పత్రిపై ఆరోపణలు చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. బుధవారం కుప్పం ఆస్పత్రిలో విచారణ చేపట్టిన డీసీహెచ్‌ఎస్ బీసీ నాయక్‌తో వారు మాట్లాడారు. ఏ గ్రేడ్ వచ్చిన ఆస్పత్రిపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే చంద్రబాబే అని, ఆయనే ఆస్పత్రిలో సక్రమంగా సేవలందించడంలేదని లేఖలు రాయడం సమంజసం కాదన్నారు. నాడు–నేడు కింద రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రిని అభివృద్ధి చేస్తుంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వంద పడకల ఆస్పత్రి అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని, జిల్లా వైద్యశాఖ అధికారులు సహకరించాలన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే అందరి లక్ష్యం కావాలని సూచించారు. విచారణను పారదర్శకంగా పూర్తి చేయాలని కోరారు.
కుప్పం ఆస్పత్రిపై ఫిర్యాదులు హాస్యాస్పదం
జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్