
తవణంపల్లె : అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. కానుకల ద్వారా రూ.12,18,724లు ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ పైమాఘం సురేంద్రరెడ్డి, ఈఓ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. దేవదాయశాఖ అధికారి కె.కమలాకర్, పంచాయతీ కార్యదర్శి కె. మహేష్, మహిళా పోలీస్ ఎం.ఎన్.గౌరి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ శివానందరెడ్డి పాల్గొన్నారు.
వైద్యసేవలకు
నిబంధనలు తప్పనిసరి
చిత్తూరు రూరల్: వైద్యసేవలందించడంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌ఓ జి. ప్రకాశం ఆదేశించారు. బుధవారం ఆయన వైద్యఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకునే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పకడ్బందీగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
చిత్తశుద్ధితో శాంతిభద్రతల రక్షణ
చిత్తూరు అర్బన్: శాంతిభద్రతల పరిరక్షణలో చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని కర్నూలు రేంజ్ హోంగార్డు కమాండెంట్ మహేష్‌కుమార్ తెలిపారు. బుధవారం చిత్తూరులోని హోంగార్డు యూనిట్లను పరిశీలించారు. అనంతరం దర్భార్ పరేడ్ నిర్వహించి హోంగార్డుల గౌరవవందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌బీమా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మెడికల్ క్యాంపులో అందరూ భాగస్వామం కావాలని సూచించారు. వేసవి నేపథ్యంలో ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీలు మురళీధర్, కృష్ణమోహన్, లక్ష్మణ్‌కుమార్, ఆర్‌ఐ నీలకంఠేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
‘సహిత’ విద్యార్థులకు భత్యం
చిత్తూరు కలెక్టరేట్ : సహిత విద్యావిభాగంలోని మొత్తం 1,752 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థులకు రూ.45.15లక్షల భత్యం విడుదల చేసినట్లు సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గృహ ఆధారిత విద్యాభత్యం కింద 284 మంది విద్యార్థులకు రూ.8,52,000 రవాణాకు గాను 430 మందికి రూ.12.9లక్షలు, దివ్యాంగ బాలికల ఉపకార వేతనం కింద 741 మందికి రూ.14,82,000 మంజూరు చేశామన్నారు. అలాగే సహాయక భత్యం కింద 297 మందికి గాను రూ.8.91లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు.
ఘనంగా ‘నాగస్త్ర–2023’
కుప్పం : పట్టణంలోని కుప్పం ఇంజినీరింగ్ కళాశాల 22వ వార్షికోత్సవం సందర్భంగా నాగస్త్ర–2023 పేరుతో బుధవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. సినీనటుడు రాజ్‌తరుణ్ ప్రత్యేక అతిథిగా కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి నృత్యం చేసి అలరించారు. కళాశాల చైర్మన్ బీసీ పనాగరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఇతర రంగాల్లోనూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. తమ కళాశాలకు రాజ్‌తరుణ్ రావడం ఆనందంగా ఉందన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అలాగే రాజ్‌తరుణ్‌ను ఘనంగా సత్కరించారు. కేఈసీ వైస్ చైర్మన్ సునీల్‌రాజ్, సీఈఓ సాగర్‌రాజ్ పాల్గొన్నారు.

గౌరవవందనం స్వీకరిస్తున్న కమాండెంట్ మహేష్‌కుమార్

సినీనటుడు రాజ్ తరుణ్‌ను సత్కరిస్తున్న కళాశాల యాజమాన్యం