
బంగారుపాళెం: నిందితుడి అరెస్ట్ చూపుతున్న పోలీసులు
కుప్పం : పట్టణంలోని మోడల్ కాలనీ వద్ద బుధవారం నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు. నిందితులు యానాదిపల్లెకు చెందిన మురుగేష్, మోడల్ కాలనీకి చెందిన కృష్ణన్‌గా గుర్తించామన్నారు. వారి నుంచి 198 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
బంగారుపాళెం:
మండలంలోని వేపనపల్లెకు చెందిన జగన్నాథం అనే వ్యక్తి ఇంట్లో కర్ణాటక మద్యం విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి 20 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. దాడిలో హెడ్‌కానిస్టేబుల్ గజేంద్ర, కానిస్టేబుల్ అజ్గర్ పాల్గొన్నారు.