
● డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
తిరుచానూరు(చంద్రగిరి): ఆది నుంచి ఈనాడు అధినేత రామోజీరావు దళితులకు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారా యణస్వామి మండిపడ్డారు. తిరుచానూరు సమీపంలోని ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. 1984లో పాదిరికుప్పం హరిజనవాడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందనే నెపంతో శ్మశాన వాటికగా కాల్చేశారన్నారు. అప్పట్లో కనీసం సానుభూతి కూడా వ్యక్తపరచలేదన్నారు. కాంగ్రెస్ అంటే రా మోజీరావుకు గిట్టకపోవడంతో అసత్యపు కథనాలు వండివార్చేవారన్నారు. కారంచేడులో ఏడుగురిని హతమారిస్తే కూడా రామోజీ రావు చంద్రబాబుకు వత్తాసు పలికారని ఆరోపించారు. రామచంద్రాపురం మండలంలో 12 గ్రామాల్లోని దళితులకు ఓటు హక్కు లేకుండా అగ్రకులాలు చేస్తే, ఎమ్మెల్యే చెవిరెడ్డి సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడి దళితులకు ఓటు హక్కును కల్పించారని గుర్తుచేశారు. రామోజీరావు ఏవిధంగా పైకి ఎదిగారో అందిరికీ తెలుసునన్నారు. మార్గదర్శి అక్రమాలపై విచారణ చేపట్టడంతో రామోజీరావు అవినీతి, స్కిల్ స్కా ములు బయపడితే జీర్ణించుకోలేక కక్షపూరితంగా వార్తలు రాస్తున్నారన్నారని నారాయణస్వామి ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిని అభివృద్ధిని కనిపించకుండా చేసి.. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీరావు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటాడా అన్న మాట కూడా రామోజీరావు కనిపించలేదా అన్నారు.
అచ్చెన్న మాటలపై అనుమానం :
మంత్రి రోజా
అచ్చెన్నాయుడు మాట్లాడే మాటలు వింటుంటే అనుమానం కలుగుతోందని మంత్రి రోజా అన్నా రు. 40 మంది తనకు టచ్‌లో ఉన్నారని ఆయన అంటుంటే, మీ పార్టీలో 175 సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక టచ్‌లో ఉన్నారా లేక ఎలాగో పార్టీ లేదు బొక్కా లేదన్నారు కదా.. టీడీపీని మూసి వేస్తారని అచెన్న చెప్పిన మాటలు నమ్మి వైఎస్సార్‌సీపీలోకి రావడానికి టచ్‌లో ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. నారా లోకేష్ వార్డు సభ్యుడికి ఎక్కువగా.. ఎమ్మెల్యే తక్కువగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వార్తల్లో నిలిచేదాని కోసం ఎమ్మెల్యే, మంత్రులకు కనీసం గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.