
సర్టిఫికెట్‌ను అందజేస్తున్న ఈఓ ధర్మారెడ్డి
తిరుపతి తుడా: శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలకు మూడు విభాగాల్లో ఐఎస్‌వో సర్టిఫికెట్లు లభించాయి. టీటీడీ పరిపాలన భవనంలో బుధ వారం ఈవో ఏవీ ధర్మారెడ్డి చేతుల మీదుగా ప్రిన్సి పల్ డాక్టర్ మురళీకృష్ణ సర్టిఫికెట్లు అందుకున్నారు. విద్యుత్ పొదుపు, పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణ, ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు సర్టిఫికెట్లు లభించాయి. ప్రిన్సిపల్ మురళీకృష్ణ, ఇతర అధ్యాపకులు, సిబ్బందిని ఈవో ధర్మారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఐఎస్‌వో ప్రతినిధులు శివయ్య, మౌళిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎస్వీబీసీకి ..
శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు గాను ఐఎస్‌వో సర్టిఫికెట్ లభించింది. ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్ ఈవో ధర్మారెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.
బైక్ ఢీకొని ఒకరి మృతి
పూతలపట్టు: మండలంలో బుధవారం బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ హరిప్రసాద్ కథనం మేరకు.. కిచ్చెన్నరాగిపల్లెకు చెందిన పి.బాలాజీనాయుడు(50) వ్యక్తిగత పనుల నిమిత్తం పూతలపట్టుకు వచ్చి తిరిగి వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న బైక్ ఢీకొంది. పాపినాయునిపల్లెకు చెందిన మునిరత్నంనాయుడు మద్యం సేవించి బైక్‌పై వస్తూ ఢీకొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ డ్రైవర్‌పై దాడి:
కేసు నమోదు
●పావురాన్ని ట్రాక్టర్‌తో తొక్కించిన ఘటన
నాయుడుపేటటౌన్ : పావురం ట్రాక్టర్ కిందపడి మృతి చెందడంతో ఆగ్రహించిన పెంపకందారులు డ్రైవర్‌పై విచాక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమో దు చేశారు. పోలీసుల కథనం.. ఈనెల 24 తేదీ మండల పరిధిలోని దరఖాస్తుకండ్రిగ వద్ద రహదారిపై ట్రాక్టర్ వస్తుండగా ఓ పావురం ఎగురుకుంటు వచ్చి ట్రాక్టర్ కిందపడి మృతి చెందింది. గమనించిన దరఖాస్తు కండ్రిగ గ్రామానికి చెందిన పావురాల పెంపకందారులు అన్‌దీప్, వెంకట సా యి, ఆకాష్, నరేష్ మూకుమ్మడిగా ట్రాక్టర్ డ్రైవర్ పురిణి వీరయ్యపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.