జిల్లా సమాచారం | - | Sakshi
Sakshi News home page

జిల్లా సమాచారం

Mar 30 2023 1:32 AM | Updated on Mar 30 2023 1:32 AM

పంచాయతీరాజ్‌ చెరువులు  : 356 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు  :  471 సొసైటీలు  :  48 సభ్యులు  : 2,560  - Sakshi

పంచాయతీరాజ్‌ చెరువులు : 356 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు : 471 సొసైటీలు : 48 సభ్యులు : 2,560

తిరుపతి అర్బన్‌: జిల్లాలో సొసైటీల ముసుగులో కొందరు అధికారుల సహకారంతో పాతవారే చెరువులపై పెత్తనం చెలాయిస్తున్నారు. 8 నెలల కిందటే సొసైటీలకు గడువు ముగిసినప్పటికీ చెరువులను తమ ఆఽధీనంలోనే ఉంచుకుంటూ చేపలు పట్టి చైన్నె మార్కెట్‌కు తరలించి జేబులు నింపుకుంటున్నారు. మత్స్యశాఖ అధికారులకు తెలిసినప్పటికీ వ్యాపారులు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా దోపిడీదారులు చెలరేగిపోతున్నారు. ఏటా జూలైలో ఏడాది కాలపరిమితికి పంచాయతీరాజ్‌ చెరువులతోపాటు మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులకు టెండర్లు నిర్వహించాల్సి ఉంది. గతే డాది రూ.కోటి మేరకు చెరువుల టెండర్ల ద్వారా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది టెండర్లు లేకుండానే పాతవారే ఇష్టారాజ్యంగా చేపలు పట్టి అమ్ముకుంటున్నారు. సాధారణంగా టెండర్‌ ద్వారా వచ్చే ఆదాయంలో ఆ చెరువు ఆయకట్టుకు 50 శాతం, పంచాయతీలకు 30 శాతం, మత్స్యశాఖకు 20 శాతం చొప్పున టెండర్‌ మొత్తాన్ని కేటాయించాల్సి ఉంది. అలా చేస్తే తమ జేబులు నిండవని కొందరు మ త్స్యశాఖ అధికారులు అడ్డదారిలో చేపలను పట్టుకునేందుకు ప్రోత్సహిస్తున్నట్లు చర్చసాగుతోంది. మత్స్యశా ఖ అధికారులు ఇకనైనా స్పందించి చేపల చెరువులకు టెండర్లు నిర్వహించి అసలైన సభ్యులకు న్యాయం చేయాలని సొసైటీ నాయ కులు కోరుతున్నారు.

వెంకటాపురం చెరువు

మా చెరువు ఇద్దరు చేతుల్లోనే

వెంకటాపురం చెరువు ఇద్దరు చేతుల్లోనే కొనసాగుతోంది. ఏళ్ల తరబడి వా రే చేపల పెత్త నం చేస్తున్నా రు. ఏటా రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. పేరుకు మాత్రమే సొసైటీ అంటున్నారు. సొసైటీలోని సభ్యులకు ప్రయోజనం చేకూరడంలేదు.

–టి.వెంకటేష్‌, వెంకటాపురం

చెరువులే అండ..

సొసైటీల ముసుగులో దోపిడీ

ప్రభుత్వ ఆదాయానికి గండి

8 నెలల క్రితమే గడువు ముగింపు

అనుమతులు లేకున్నా చేపల వేట

ఒకరిద్దరి చేతుల్లో చేపల చెరువులు

కమీషన్ల కక్కుర్తిలో

మత్స్యశాఖ అధికారులు

అవినీతే నిండా

చర్యలు తీసుకుంటాం

టెండర్లు నిర్వహించకుండా సొసైటీ చెరువుల్లో చేపలు పట్టేందుకు వీల్లేదు. గత ఏడాది జూన్‌ 30వ తేదీ నాటికి సొసైటీల గడువు పూర్తయింది. తిరిగి టెండర్లు నిర్వహిస్తేనే చేపలు పట్టాలి. గడువు ముగిసిన సొసైటీల్లో చేపలు పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. విచారణ చేస్తాం. అవసరమైతే కేసులు పెడుతాం.

–చాంద్‌బాషా, జిల్లా అధికారి, మత్స్యశాఖ

తిరుపతికి సమీపంలోని వెంకటాపురం చెరువు టీడీపీ హయాం నుంచి ఇద్దరు వ్యక్తుల ఆధీనంలోనే ఉంది. నాడు టీడీపీ నాయకులమని.. నేడు అధికారపార్టీ అని చెప్పుకుంటూ చేపలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వారి అక్రమాలను తెలుసుకున్న సొసైటీ సభ్యులు సభ్యత్వాలను రద్దు చేసుకున్నారు. గత ఏడాది జూన్‌తో సొసైటీ గడువు ముగిసినా టెండర్‌ పిలువకుండా అడ్డుపడుతున్నారు. కొందరు అధికారులను లోబరుచుకుని

తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ చేపల

వేటే ఆదాయంగా జేబులు నింపుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. ఇది ఉదాహరణ మాత్రమే చాలా చెరువులు కొందరి కబంధహస్తాల్లో ఉంటూ మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతోంది.

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement