
నేడు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు
తిరుపతి రూరల్: తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపల్, మండల, పంచాయతీల్లో గురువారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా సెలవు అయినప్పటికీ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు పనిచేస్తాయని ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ ఎస్‌ఈ కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చెల్లింపు కేంద్రాల్లో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.