
ఐరాల మండలం, మిట్టూరుకు చెందిన రేఖ ఎంఏ, ఎంఈడీ పూర్తిచేశారు. ఉద్యోగం కోసం ఎదురుచూడలేదు. ఉన్న భూమిలో ప్రకృతి సాగుచేయాలని భావించారు. మొత్తం పది ఎకరాల పొలం ఉంటే.. అందులో మూడు ఎకరాలను ప్రకృతి సాగు కోసం కేటాయించారు. మిగిలిన భూమిలో మామిడి సాగు చేస్తున్నారు. మూడెకరాల్లో వరి, వేరుశనగ, చిరుధాన్యాలు, వివిధ రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న పంట ఉత్పత్తులను కొనుగోలు చేసుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతి సాగు..భలే బాగు

రేఖ