ఇద్దరు మిత్రుల ‘ఖతర్నాక్‌ ఛాలెంజ్‌’.. డెలివరీ యాప్‌తో సంచలనం

Zepto Grocery Deliver App Founders - Sakshi

Zepto Grocery Deliver App Founders Inspirational Success Story: వయసు 19 ఏళ్లు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఉన్నత విద్యాలయం చదువుల్ని పక్కనపెట్టి..  ఒకే లక్క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కేవలం పది నిమిషాల్లో సరుకులు డెలివరీ చేసే యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. తద్వారా గ్రోఫర్స్‌, డుంజో, స్విగ్గీలాంటి సర్వీసులతో పోటీ పడుతున్నారు. అయితే ఇంత చిన్నవయసులో దాపు 450 కోట్ల పెట్టుబడి ఎలా సమీకరించుకోగలిగారు?.. మార్కెట్‌లో దాని విలువను 2 వేల కోట్లకుపైగా(ప్రస్తుతం) ఎలా చేర్చగలిగారు?.. అదెలాగో.. జెప్టో యాప్‌ కథ చదివితే తెలుస్తుంది.  

ముంబై బేస్డ్‌గా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది జెప్టో యాప్‌. డెలివరీ యాప్‌ స్టార్టప్‌లో ఇప్పుడు ఇదొక సంచలనం. బచ్‌పన్‌ దోస్తులైన  ఆదిత్‌ పాలిచా, కైవల్య వోహ్రా.. ఇద్దరు కుర్రాళ్లు దీనిని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. లొకేషన్‌ను బట్టి ETA(ఎక్స్‌పెక్టెడ్‌ టైం ఆఫ్‌ ఎరైవల్‌) కేవలం 6 నుంచి 7 నిమిషాల్లోనే సరుకుల్ని డెలివరీ చేయిస్తుండడం ఈ యాప్‌ ప్రత్యేకత.  మొత్తం మీద 10 నిమిషాల్లో సరుకులు డెలివరీ అయ్యేలా చూడడం ఈ యాప్‌ ఫేస్‌ చేస్తున్న ఛాలెంజ్‌. మరి ఆ టైంలోపు డెలివరీ చేయకపోతే.. 

పండ్లు, మాంసం, మందులు, ఇతర కిరాణా సామాన్లు.. జెప్టో యాప్‌ ద్వారా డెలివరీ చేస్తున్నారు. ఉదయం 7 నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా సర్వీసులు కొనసాగుతున్నాయి. ఒకవేళ పది నిమిషాల్లోపు డెలివరీ చేయకపోతే..  సంబంధిత సరుకుల మీద డిస్కౌంట్స్‌తో పాటు, ఇతరత్ర ఇన్సెంటివ్స్‌ యాప్‌ యూజర్లకు అందిస్తారు. వాటికి అయ్యే ఖర్చు జెప్టో యాప్‌ నిర్వాహకులే భరిస్తున్నారు. ఇక ఈ యాప్‌ ద్వారా జరుగుతున్న డెలివరీలు ప్రస్తుతానికైతే ఛార్జీలు వసూలు చేయడం లేదు. 

అతిపెద్ద ఛాలెంజ్‌.. 

ఈ స్థాయికి చేరుకుంటారని ఏ దశలోనూ అనుకోలేదు పలిచా, వోహ్రాలు. ఈ బాల్య స్నేహితులు కలిసే పెరిగారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌​ కోసం ఇద్దరూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. యూనివర్సిటీలో ఉండగానే గ్రాసరీ డెలివరీ యాప్‌ను ప్రయోగాత్మకంగా డెవలప్‌ చేయడం మొదలుపెట్టారు. ఆ సరదా ప్రయోగం వర్కవుట్‌ కావడంతో పర్‌ఫెక్ట్‌ మోడల్‌ కోసం మూడు నెలలు కష్టపడ్డారు. భారత్‌లో డెలివరీ స్టార్టప్‌లకు మంచి గిరాకీ ఉందని గుర్తించి.. కాలేజీ చదువుల్ని పక్కనపెట్టి స్వస్థలానికి చేశారు.  క్విక్‌ డెలివరీ అంటే 45 నిమిషాలనే ఆలోచన ఉందట మొదట వీళ్లిద్దరికీ. కానీ, ఒపినీయన్‌ సర్వేలో జనాలు 10-15 నిమిషాలు అనేసరికి.. భయం భయంగానే యాప్‌ను మొదలుపెట్టారు. అంత తక్కువ టైంలో యాక్సిడెంట్లు కాకుండా రైడర్లు డెలివరీ చేయడం మరో పెద్ద టాస్క్‌. అదే టైంలో డెలివరీకి తగ్గట్లు లొకేషన్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా రిస్క్‌ తీసుకోకుండా యాప్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేయగలుగుతున్నారు.

ఇన్వెస్టర్లను మెప్పించి.. 

యాప్‌ మార్కెట్‌లోకి తేవడానికి వీళ్లిద్దరూ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ముందు తమ సర్వీస్‌ వేగాన్ని ఇన్వెస్టర్లకే రుచి చూపించారు వీళ్లు. అలా ఆర్నేళ్లపాటు కష్టపడి 450 కోట్ల రూపాయల పెట్టుబడి సమీకరణతో జెప్టోను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేశారు.  ప్రస్తుతం ఈ స్టార్టప్‌ విలువ 200-300 మిలియన్‌ డాలర్లుగా ఉంది(రెండు వేల కోట్లరూపాయలకుపైనే). వై కాంబినేటర్‌, గ్లేడ్‌ బ్రూక్‌ క్యాపిటల్‌తో పాటు ఇన్వెస్టర్లు లాచీ గ్రూమ్‌, నీరజ్‌అరోరా పెట్టుబడులు ఉన్నాయి జెప్టో స్టార్టప్‌లో. 

టాలెంట్‌కి టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చని, విజయం అందుకోవాలంటే అమితమైన ఆత్మవిశ్వాసమూ, నమ్మకమూ, కెరీర్‌లో ముందడుగు వేసే ధైర్యమూ ఉండాలని చెబుతోంది ఈ ఇద్దరి మిత్రుల సక్సెస్‌ కథ. 

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top