స్టైలిష్ అండ్ ఇన్నోవేటివ్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన 'జెనో సిరీస్' ఇప్పుడు తన కొత్త స్మార్ట్‌ఫోన్ జెనో 200ను లాంచ్ చేసింది. ఇది అమెజాన్ ఈకామర్స్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంది. దీని ధర కేవలం రూ.9,999 మాత్రమే.
ఈ ఫోన్‌లో MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉంది. కాబట్టి సాధారణ బడ్జెట్ ఫోన్‌లతో పోలిస్తే ఇది చాలా దృఢంగా ఉంటుంది. ఇది IP65 రేటింగ్ ఉండటంతో ధూళి, నీటి నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఇందులో AI అసిస్టెంట్ కూడా ఉండటం వల్ల.. ఇది రోజువారీ పనులను మరింత సులభంగా.. వేగంగా చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫోన్ 4+8GB RAM, 128GB స్టోరేజ్‌తో లభిస్తుంది.
జెనో 200 ఫోన్‌లో 6.75 ఇంచెస్ 120Hz HD+ డిస్‌ప్లే ఉంది. DTS సౌండ్ సపోర్ట్ వల్ల వీడియోలు, మ్యూజిక్ మరింత అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఈ ఫోన్ నాలుగేళ్లు పాటు మంచి పనితీరును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫోటోగ్రఫీ కోసం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా లభిస్తుంది. అలాగే IR Blaster ద్వారా TV, AC వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కంట్రోల్ చేయవచ్చు.
ఆక్టా కోర్ యూనిసోక్ టీ7250 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 గో వంటివి జెనో 200 ఫోన్‌లో ఉండటం వల్ల, ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో కాలింగ్‌లో మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో దీనిని రోజంతా సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ కామెట్ ఆరంజ్, మీటియోర్ టైటానియం, బ్లూ వంటి రంగులలో లభిస్తుంది.
రూ.10 వేలు కంటే తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లు
టెక్నో స్పార్క్ గో 3: ప్రారంభ ధర రూ.9,999
పోకో సి81ఎక్స్: ప్రారంభ ధర రూ.9,999
లావా బోల్డ్ N2 ప్రో: ప్రారంభ ధర రూ.7,999
టెక్నో పాప్ X: ప్రారంభ ధర రూ.9,299
ఏఐ+ పల్స్ 2: ప్రారంభ ధర రూ.8,999


