లోగో డిజైన్‌ చేయండి‌.. లక్ష గెలుచుకోండి | Win Rs 1 Lakh Telangana Housing Board Logo Design LIG Housing Scheme | Sakshi
Sakshi News home page

లోగో డిజైన్‌ చేయండి‌.. లక్ష గెలుచుకోండి

Jul 9 2026 1:59 AM | Updated on Jul 9 2026 2:02 AM

Win Rs 1 Lakh Telangana Housing Board Logo Design LIG Housing Scheme

సాక్షి, హైదరాబాద్‌: క్యూర్‌ పరిధిలో చేపట్టనున్న ఎల్‌ఐజీ గృహనిర్మాణ పథకానికి లోగో కోసం హౌసింగ్‌ బోర్డు సోషల్‌ మీడియా వేదికగా బుధవారం పోటీని ప్రకటించింది. లోగో రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతో అధికారిక చిహ్నం (అఫిషియల్‌ లోగోను) గురించి  పోటీని నిర్వహిస్తున్నట్లు, ఉత్తమమైన లోగోకు రూ.లక్షబహుమతి అందచేయనున్నట్లు హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వీపీ గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పోటీలో పాల్గొనదలచిన వారు తమ డిజైన్‌లను తెలంగాణ హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ tghd.officialలో https://www.instagram.com/p/Dahnht3zFwE/  ద్వారా ఈ నెల 12వ తేదీకల్లా సమర్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement