ఫ్యాక్టరీ కప్పులపై టర్బో వెంటిలేటర్ ఎందుకు ఏర్పాటు చేస్తారు?

What is the purpose of a turbine ventilator? - Sakshi

మనం ఏదైనా పెద్ద పారిశ్రామిక ప్రదేశాలను సందర్శించినప్పుడు లేదా మీ దగరలో ఉన్న పారిశ్రామిక కర్మాగారాల పైకప్పులపై కర్మాగారాల పైకప్పులపై స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన చిన్న గుండ్రని గోపురాలను మీరు చూసి ఉంటారు. అయితే, గుండ్రంగా తిరుగుతూ ఉన్న వాటిని పైన ఎందుకు ఏర్పాటు చేస్తారో మీకు తెలుసా?. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరికరాన్ని టర్బో వెంటిలేటర్ అని పిలుస్తారు. దీనిని ఎయిర్ వెంటిలేటర్, టర్బైన్ వెంటిలేటర్, రూఫ్ ఎక్స్‌ట్రాక్టర్ వంటి అనేక పేర్లతో కూడా పిలుస్తారు. 

ప్రస్తుతం టర్బో వెంటిలేటర్లను కర్మాగారాలు, పెద్ద దుకాణాలలో మాత్రమే కాకుండా, పెద్ద పెద్ద ప్రాంగణాల్లో, రైల్వే స్టేషన్ల పైకప్పులపై కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి చాలా మితమైన వేగంతో నడుస్తాయి. కర్మాగారాలలో ఉండే లోపలి వేడి గాలులను పైకప్పు ద్వారా బయటికి పంపించడం వీటి ప్రధాన పని. ఇలా వేడి గాలులను బయటకి పంపించినప్పుడు కిటికీలు, ప్రధాన ద్వారాల నుంచి తాజా సహజమైన గాలులు ఫ్యాక్టరీలలో ఎక్కువసేపు ఉంటాయి. దీని వల్ల ఆ కర్మాగారాలలో పనిచేసే ఉద్యోగులకు చాలా ఉపశమనం లభిస్తుంది. టర్బో వెంటిలేటర్ ద్వారా వేడి గాలులతో పాటు కర్మాగారాల నుంచి వెలువడే వచ్చే చెడు, కెమికల్ వాసనను బయటకి పంపించడానికి సహాయ పడుతుంది. అలాగే వాతావరణం మారినప్పుడు లోపల ఉన్న తేమను కూడా బయటకు పంపిస్తుంది.

చదవండి:

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top