వివో నుంచి గాల్లో ఎగిరే కెమెరా!..ఫోటోలు వైరల్‌!

Vivo Reportedly Working On Smartphone With Integrated Flying Camera  - Sakshi

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వివో గింబల్‌ను అమర్చి ఉన్న కెమెరా ఫోన్‌ ఎక్స్‌ 50, ఎక్స్‌ 60 మోడళ్లను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వివో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వివో ఇంటిగ్రేట్‌డ్‌ ఫ్లయింగ్‌ కెమెరాతో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  డ్రోన్‌ లాంటి సామర్థ్యాలను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వివో రూపొందించనుంది. భవిష్యత్తులో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్‌కు తేలికపాటి డ్రోన్‌ను అమర్చనున్నారు. ఈ డ్రోన్‌ సహయంతో ఏరియల్‌  ఫోటోలను, వీడియోలను తీయవచ్చును.

వివో 2020 డిసెంబర్‌లో వరల్డ్‌ ఇంటలెక్ట్చువల్‌ ప్రాపర్టీ  కార్యాలయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు పేటెంట్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.కాగా తాజాగా ఇప్పుడు  గాల్లో తేలే  కెమెరాతో ఉన్న  వివో స్మార్ట్‌ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. పేటెంట్‌ కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తోందని భావించడంలేదు.


చాలా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు పేటెంట్‌ కంపెనీ వద్ద సుమారు కొన్ని వేల స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లకు పేటెంట్లు నమోదైన అందులో కేవలం​ కొన్ని మాత్రమే మార్కెట్‌లోకి వస్తున్నాయని పేటెంట‍్లను నమోదుచేసే సంస్థలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. 


అంతకుముందు వివో గింబల్ సిస్టమ్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో ఎక్స్ 50 ప్రో  గింబల్ వ్యవస్థను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అమర్చారు.

ఈ స్మార్ట్‌ ఫోన్లో 90Hz అధిక రిఫ్రెష్ రేటుతో 6.56 అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. వివో ఎక్స్ 50 ప్రో ఆండ్రాయిడ్ 10 వెర్షన్‌ను కలిగి ఉంది . ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో రూ .49,990.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top